రామోజీ సార్ జర జాగ్రత్త...

 

నిప్పు లేకుండా పొగ రాదు ఇప్పుడు రామోజీ రావు, జగన్ విషయంలో నిజం అయిందని చెప్పొచ్చు. గత కొద్దికాలంగా రామోజీ రావు, జగన్ లు ఇద్దరూ భేటీ అవ్వడంపై పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. రామోజీ రావు, జగన్ కలిసే అవకాశం ఉందని.. పాదయాత్రపై ఫుల్ కవరేజ్ ఇస్తారని అనుకున్నారు. ఇప్పుడు అదే నిజమైంది. జగన్ పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈనాడు బాగానే కవరేజ్ ఇచ్చింది. అప్పుడే టీడీపీ పై ఆర్టికల్స్ కూడూ రేసేస్తుంది. ఎక్కడో మ‌ధ్య‌లో పేజీలో చిన్న సైజ్లో రావాల్సిన వార్త మెయిన్ పేజీ రెండవ పేజీల్లో.. “బాబు దిగిపోతేనే జాబు” అంటూ వార్త ప్ర‌చురించ‌డంతో రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అంతేకాదు "ప్యారడైజ్ పేపర్స్" లో జగన్ పేరు వచ్చిందన్న వార్తలు వచ్చిన నేపథ్యంపై కూడా స్పందిస్తూ... ప్యార‌డైజ్ ప‌త్రాల లీక్ విష‌యంలో జ‌గన్ ప్రస్తావన మాత్రమే ఉందని చెబుతూ.. జ‌గ‌న్‌కు అనుకూలంగా ఈనాడులో క‌థ‌నం రాసింది. దీంతో రామోజీ, వైసీపీకి అనుకూలంగా మారారన్న విషయం అర్ధమయిపోయింది. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా ఒకసారి ఇలాగే చేసి వైఎస్ విషయంలో రామోజీ దెబ్బ తిన్నాడు.. అప్పట్లో వైఎస్ పాదయాత్ర చేసినప్పుడు రామోజీ మామూలు కవరేజ్ ఇవ్వలేదు. ఫలితం.. వైఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత...రామోజీ మీద కేసులు. ఆ తరువాత వైఎస్ కుటుంబానికి రామోజీకి విబేధాలు ఏర్పాడ్డాయి. ఆ తరువాత వారికి వ్యతిరేకంగా ఈనాడు మారింది. మరి ఇప్పుడు జగన్ విషయంలో మరోసారి రామోజీ తన కోపాన్ని సైతం పక్కన పెట్టి మనసు మార్చుకున్నాడు. మరి ఆల్ రెడీ తండ్రి వల్ల దెబ్బతిన్న రామోజీ ఇప్పుడు కొడుక్కి సపోర్టు ఇస్తున్నాడు. ఇప్పుడేం జరుగుతుందో చూడాలి. రామోజీ సార్ మరి ఈసారైనా అలా కాకుండా జాగ్రత్త పడండి...