పదవి విరమణ అనంతరం ప్రణబ్ ఎక్కడ ఉంటారో తెలుసా..?

జూలై 25న భారత నూతన రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయనుండటంతో ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాజీగా మారిపోనున్నారు. దీంతో ఆయన రాష్ట్రపతి భవన్‌ను ఖాళీ చేయాలి..ఈ నేపథ్యంలో ప్రణబ్ ఎక్కడ నివసిస్తారు..ఏం చేస్తారు అని సర్వత్రా చర్చ నడుస్తోంది. ఢిల్లీ 10 రాజాజీ రోడ్‌లో దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఉన్న ఇంటికి ప్రణబ్ వెళ్లనున్నారు. 11,776 చదరపు విస్తీర్ణంలో ఉన్న ఈ భవంతిలో ఎనిమిది గదులు ఉన్నాయి. ఆయన రాక సందర్భంగా ఆ విల్లాలో ఉన్న ఫర్నీచర్‌ను, నేమ్ ప్లేట్లను మార్చేపనిలో అధికారులు బిజీగా ఉన్నారు. ఈ ఐదేళ్ల పదవీ కాలంలో అనుభవాల గురించి ప్రణబ్ ఓ పుస్తకం రాసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.