వర్మకి ఎటకారం మామూలుగా లేదుగా...!

 

'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాపై ఇప్పటికే రామ్ గోపాల్ వర్మకు, సోమిరెడ్డి మధ్య ఫేస్ బుక్ సాక్షిగా మాటల యుద్దం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో టీడీపీ ఎమ్మెల్యే వర్మ కౌంటర్లకు బలయ్యారు. అతనెవరో కాదు... ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి. వర్మపై ప్రభాకర్ చౌదరి విమర్శలు గుప్పించగా.. దానిపై వర్మ తనదైన శైలిలో కామెంట్లు విసిరాడు. ఒకసారి ఎమ్మెల్యే కౌంటర్ కి.. వర్మ ఎన్ కౌంటర్ ఎలా ఇచ్చాడో చూద్దాం..

ప్రభాకర్ చౌదరి: రాంగోపాల్ వర్మ అనే వ్యక్తి ఓ సైకో
RGV :అవునా డాక్టర్ గారు.. మీకు సైకియాట్రీ మీద డిగ్రీ కూడా ఉందా? అరెరే మీరు చదువు రాని వారనుకున్నాను.. సారి నా బాడ్


ప్రభాకర్ చౌదరి: కులాల మధ్య, రాజకీయాల మధ్య ఇష్టం వచ్చినట్లు సినిమాలు తియ్యకూడదు.
RGV : అంటే ఇష్టం లేనట్టు తీస్తే, ఓకేనా డాక్టర్ గారు?

 

ప్రభాకర్ చౌదరి: సినిమా తీసేటప్పుడు అన్ని రాజకీయ పక్షాలను పిలిచి మాట్లాడాలి
RGV :ఇంతకన్న సైకో కామెంట్ బహుశా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ పేషెంట్లు కూడా ఇచ్చి వుండరు

 

ప్రభాకర్ చౌదరి: రామారావు వ్యక్తిత్వాన్ని ఇనుమడింపజేసే విధంగా మూవీ ఉండాలి
RGV : ఛా.. మా నాయనే.. ఎవరికీ తట్టని ఎంత గొప్ప మాట చెప్పావు చౌదరి ..నీ కడుపు చల్లగుండ

 

ప్రభాకర్ చౌదరి: ఎన్టీఆర్ వ్యక్తిత్వానికి మచ్చ కలిగే రీతిలో ఏమి తీసినా తగిన మూల్యం చెల్లించుకుంటావు
RGV : అంటే మీ జేబులనిండా డబ్బులు నింపితే NTR గారిని తిట్టినా ఫర్వాలేదా ? నీ తస్సాదియ్యా

 

ప్రభాకర్ చౌదరి: నా సినిమా నా ఇష్టం అంటే చూస్తు ఊరుకోం
RGV :ఊరుకోక డాన్స్ చేస్తారా సార్? లేక పాట కూడా పాడతారా?

 

ప్రభాకర్ చౌదరి: దర్శకుడంటే తన సినిమా ద్వారా ప్రేక్షకులను ఆనందింపజేయాలి.. రంజింపజేయాలి. సందేశాత్మక చిత్రాలతో సమాజానికి ఉపయోగపడాలి.
RGV : అబ్బో.. సినిమా పట్ల మీకున్న ఈ అత్యంత అమోఘమైన అవగాహన చూస్తుంటే రాజమౌళి పొట్ట కూడా కొట్టేట్టు వున్నారు మీరు..బాబోయ్

 

ప్రభాకర్ చౌదరి: లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమా వెనుక వైసీపీ హస్తం ఉంది.
RGV : ‘ఆ హస్తం వెనక మీ హస్తం ఉందా సార్? లేకపోతే మీకెలా తెలుసు ఎవరి వెనుక ఎవరున్నారో ? అయినా ముందు వెనకాలవున్న, వెనక ముందు గ్రూపుల గురించి మీ వెనకున్న గ్రూపులకి బాగా తెలుసని నాకు కూడా తెలుసని మీకు కూడా తెలుసు’..ఈ కామెంట్ని అర్థం చేసుకునే మైండ్ మీకు లేకపోతే నేను మిమ్మల్ని అలా వెనక్కి తీసుకెళ్లి చెప్తా.

 

మొత్తానికి ఈ రిప్లైస్ ను బట్టి చూస్తేనే తెలుస్తోంది.. వర్మకు ఎంత ఎటకారం ఉందో అన్న సంగతి... మరి వర్మ నోటికి భయపడి ఇంకెవరైనా విమర్శలు గుప్పిస్తారా...? లేదా.. సైలెంట్ గా ఉంటారా.. చూద్దాం.. ఏం జరుగుతుందో...