సస్పెన్స్ కొనసాగిస్తున్న కేసీఆర్

రాజ్యసభకు తెలంగాణలోని 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు స్థానాలలో సునాయాసంగా గెలుస్తామన్న నమ్మకంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు. అయితే, రెండు స్థానాల్లో టీఆర్ ఎస్ ఈజీ గా గెలిచే అవకాశం ఉంది. మరో సీటును ఎంఐఎం మద్దతుతో కైవసం చేసుకునేందుకు సన్నాహాలు చేస్తుంది. రాజ్యసభ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఈ రోజు మధ్యాహ్నం తెలంగాణ భవన్లో టీఆర్ ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ తర్వాత, కేసీఆర్ ముగ్గురు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించనున్నారు. 

కేసీఆర్ మూడు వేర్వేరు సామాజిక వర్గాల అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఇప్పటికే టీఆర్ ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ పేరు ఖరారైంది. మరో స్థానాన్ని యాదవులకు కేటాయిస్తామని కేసీఆర్ ఇదివరకే తెలిపారు. జైపాల్ యాదవ్, నోముల నర్సింహయ్య, శ్రీనివాస్ యాదవ్, మురళీ యాదవ్, లింగయ్య యాదవ్, కృష్ణ యాదవ్ తదితరుల పేర్లు పరిశీలనలో ఉండగా, జైపాల్ యాదవ్ కు సీట్ దక్కే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అయితే మూడో స్థానం విషయంలోనే క్లారిటీ రావాల్సి ఉంది.