రజనీ పార్టీ పేరు ఇదేనా..

 

తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ ఎప్పుడైతే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారో అప్పటినుండి... తమిళనాడు రాజకీయాలు ఇంకాస్త వేడిగా తయారయ్యారు. రజనీ పొలిటికల్ ఎంట్రీ గురించి రోజుకో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. రజనీ పార్టీ పేరేంటి... ఆయన పార్టీ సింబల్ గురించి ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే...ఆయన పార్టీ పేరు బయటకు వచ్చింది. త‌న పార్టీలోకి వారంద‌రిని ఆహ్వానిస్తూ “రజినిమంద్రం.ఓఆర్‌జీ” పేరుతో తలైవా ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. కేవలం రెండు రోజుల్లో లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారు. ర‌జ‌నీ మాట్లాడుతూ త‌మిళ‌నాడు వ్యాప్తంగా ఉన్న త‌న అభిమానుల‌ను ఒకే గొడుకు కింద‌కు తీసుకు వ‌చ్చేందుకు ఈ వెబ్‌సైట్ ఏర్పాటు చేశాన‌ని, మీరంతా ఇందులో పేర్లు న‌మోదు చేయించుకోవాల‌న్నారు. ర‌జ‌నీ ఓ వీడియో సందేశం ఇలా పోస్ట్ చేశారో ? లేదో వెంట‌నే అభిమాన సందోహంతో వెబ్‌సైట్‌ నిండిపోయింది. అయితే ఆయ‌న వెబ్‌సైట్‌కు పెట్టిన పేరే ఆయ‌న పార్టీకి కూడా పెట్ట‌వ‌చ్చ‌న్న ఊహాగానాలు న‌డుస్తున్నాయి. మరి ర‌జ‌నీ పార్టీ పేరు, సింబ‌ల్‌పై క్లారిటీ రావాలంటే సంక్రాంతి వరకూ ఆగాల్సిందే.