రజనీకాంత్ కు సీఎం అయ్యే అర్హత లేదు...!


రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై నటుడు శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీం కోర్టు జల్లికట్టు పై నిషేదం విధించిన నేపథ్యంలో దానిపై స్పందించిన రజనీ కాంత్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పెద్దగా అందం, తెలివి లేకపోయినా తమిళ ప్రజలు నన్ను ఆదరించారు.. జల్లికట్టు తమిళుల సంస్కృతి.. ఎవరైనా సంస్కృతి విషయంలో కలుగజేసుకోకూడదు.. ఎలాంటి నిబంధనలైనా విధించండి... అయితే జల్లికట్టుపై నిషేదం వద్దు అని ఆయన వ్యాఖ్యానించారు. పెద్దవారు మనకంటూ సంప్రదాయాన్ని ఏర్పరిచారని.. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. జల్లికట్టు ఖచ్చితంగా జరగాల్సిందే అని స్పష్టం చేశారు. ఇక రజనీ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ పార్టీ నేతలు, విశ్లేషకులు రాజకీయ ప్రవేశంపై రజనీ ఆసక్తి చూపిస్తున్నారా అంటూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే తెరపైకి వచ్చిన శరత్ కుమార్ రజనీకాంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ ఎంత సూపర్ స్టార్ అయినా.. రాజకీయాల్లోకి రావడానికి మాత్రం వ్యతిరేకిస్తా.. రజనీకాంత్ కు సీఎం అయ్యే అర్హత లేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో శరత్ కుమార్ వ్యాఖ్యలపై  రజకీకాంత్ అభిమానుల ఆందోళనలు చేపట్టారు. శరత్ కుమార్ దిష్టి బొమ్మలు తగలబెట్టి నిరసనలు తెలిపారు. మరి దీనిపై రజనీకాంత్ ఎలా స్పందిస్తారో చూడాలి.