రజనీకి వ్యతిరేకంగా తమిళ సంఘాల నిరసనలు...


తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల తన అభిమాన సంఘాలతో భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ భేటీలో తాను కర్ణాటకలో పుట్టినా ఎన్నో ఏళ్లనుండి తమిళనాడులో ఉంటున్నానని.. నేను తమిళుడినేనంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేగుతుంది. రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రావొద్దని నినదిస్తూ ఆందోళనకు దిగాయి. తమిళ సంఘాలు, తమిళ భాషా, సాంస్క తికవాదులు ప్రధానంగా రజనీకాంత్‌ స్థానికత అంశాన్ని లేవనెత్తుతున్నారు. ఆయన తమిళుడు కాదని, ఆయనను తమిళ రాజకీయాల్లో అడుగుపెట్టనివ్వబోమంటూ తమిళ సంఘాలు ఆందోళనబాట పట్టాయి. చెన్నైలోని రజనీకాంత్‌ ఇంటివద్ద పెద్దసంఖ్యలో తమిళ సంఘాల కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. దీంతో రజనీ ఇంటివద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.