రాజస్థాన్ హైకోర్టు జడ్జీగా అంధుడు...

 

రాజస్థాన్ హైకోర్టు జడ్జీగా అంధుడైన వ్యక్తి నియమితులు కావడం ఆసక్తి రేపుతోంది. రాజస్థాన్ లోని భిల్‌ వారా ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమికవిద్య పూర్తి చేసిన బ్రహ్మానందశర్మ (31).. 2013లో రాజస్థాన్ హైకోర్టు నిర్వహించిన న్యాయనియామక పరీక్షలో 83వ ర్యాంకు సాధించారు. అనంతరం హైకోర్టు అతడికి శిక్షణనిచ్చి చిత్తోర్‌ ఘడ్‌ లో పోస్టింగ్ ఇచ్చింది. అక్కడి నుంచి ఇటీవలే ఆయన అజ్మీర్ లోని సర్వార్‌ కు బదీలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...హైకోర్టు జడ్జ్ కావాలన్న లక్ష్యంతో చాలా కష్టపడి చదివానని...అది సరిపోదని కోచింగ్ సెంటర్లకు వెళితే అక్కడ.. అంధత్వం కారణంగా తనకు శిక్షణ ఇచ్చేందుకు నిరాకరించేవారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న తన భార్య సహకారంతో తాను జడ్జీని కాగలిగానని ఆయన చెప్పారు.