మరోసారి దెబ్బ కొట్టిన రాజస్థాన్..

 

రాజస్థాన్ ప్రజల్లో మోడీ ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకతను ఇటీవల జరిగిన ఎన్నికల్లో చూపించిన సంగతి తెలిసిందే. రెండు లోక్ సభ స్థానాలకు ఉపఎన్నికలు జరుగగా.. రెండు స్థానాలు కాంగ్రెస్సే గెలుచుకుంది. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి బీజేపీకి షాకిచ్చారు రాజస్థాన్ ప్రజలు. రాష్ట్లంలో 21 జిల్లాల్లో మంగళవారం ఉపఎన్నికలు జరిగాయి. 6 జడ్పీటీసీ 21 పంచాయితీ సమితీ సభ్యులకు ఉపఎన్నికలు జరిగాయి.  అయితే ఈ ఎన్నికల్లో.. 6 జడ్పీటీసీ స్థానాలకు గాను 4 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది. ఇక 21 పంచాయితీ సమితి సభ్యుల ఉపఎన్నికల్లో కాంగ్రెస్ 12 చోట్ల, బీజేపీ 8 చోట్ల గెలుపొందాయి. మొత్తానికి చూడబోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మరో సారి బొమ్మ చూపించేలా ఉన్నారు రాజస్థాన్ వాసులు.