ఏపీ అసెంబ్లీకి రాజమౌళి సలహాలు..


ఏపీ అసెంబ్లీ నిర్మాణ నేపథ్యంలో..దానికి తగిన డిజైన్లను రూపొందించడంలో ఏపీ ప్రభుత్వం డైరెక్టరు రాజమౌళిని కోరిన సంగతి తెలిసిందే. ఇక ప్రభుత్వం తనకు ఇచ్చిన బాధ్యతల నేపథ్యంలో రాజమౌళి అప్పుడే పని మొదలు పెట్టారు. దీనిలో భాగంగానే ఆయన లండన్ కూడా వెళ్లి వచ్చినట్టు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు నిర్మాణాలకు సంబంధించి నార్మన్‌ ఫోస్టర్‌ వర్క్ షాప్ను ఆయన ఆసక్తికరంగా తిలకించారట. అంతేకాదు దూరం నుండి కూడా కనిపించాలంటే భవనాల ఎత్తు ఎంత ఉండాలి... ఎలేవెషన్లు ఎలా ఉండాలి అని ఆయన కొన్ని సలహాలు కూడా ఇచ్చారంట. ముందు వజ్రం ఆకారంలో శాసనసభను నిర్మించాలని అనుకున్నా... ఆ తరువాత రాజమౌళి సూచనతో ఆ ప్రయత్నం విరమించుకున్నారట. వీటి ఆధారంగా తొందర్లోనే వాళ్ళు ఫైనల్ ఆకృతులు తయారుచేసి.. ఈ నెల చివరన ముఖ్యమంత్రి లండన్ వెళ్ళి నార్మన్‌ ఫోస్టర్‌ రూపొందించిన ఫైనల్ ఆకృతులు చూసి, ఆయన సంతృప్తి చెందితే అతి త్వరలో భూమి పూజ చేసి నిర్మాణాలు చేపడతారట.