వర్షంలో ఆడుకుంటున్నారా..? అయితే జాగ్రత్త

 

వర్షాకాలం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి..బయట వర్షం పడుతుంటూ సరదాగా చిరు జల్లుల్లో తడిసిపోతాం.. ఇంట్లోకి వచ్చి అమ్మ చేతి వేడి వేడి పకోడీలో.. భజ్జీలో తినడం అబ్బా ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం.. అయితే వర్షంలో తడవటం ఆ క్షణం వరకు బాగున్నా.. తడిసిన తర్వాత మన శరీరాలతో ఆడుకోవటానికి వైరస్‌లు కాచుకుని కూర్చుంటాయి. ఈ కాలంలో బ్యాక్టీరియా, ఫంగస్, ఈస్ట్‌లు ఇన్‌ఫెక్షన్లను కలగజేస్తాయి.. అందుకే వర్షాకాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్యులు.

 

అవేంటో ఒకసారి చూద్దాం:

* చర్మాన్ని వీలైనంత పొడిగా ఉంచుకోవాలి.

* చేతులు, కాలి వేళ్ల మధ్య తడిని ఎప్పటికప్పుడు తుడుచుకుంటూ..యాంటీ ఫంగల్ పౌడర్ చల్లుకోవాలి.

పాదాలకు ఎక్కువ చెమట పట్టే శరీరతత్వం ఉన్నవాళ్లు ఈ కాలంలో షూస్‌కి బదులు గాలి ఆడే చెప్పులు ధరించడం మంచిది.

* నీటిలో ఎక్కువగా పనిచేసే వాళ్లు, గృహిణులు, రైతులు, కూలీలు పాదాలకు, చేతులకు గ్లౌజులు వేసుకోవాలి.

* షుగర్ ఉన్నవాళ్లు దానిని అదుపులో ఉంచుకోవాలి..ఎందుకంటే వర్షాకాలంలో షుగర్ పేషేంట్ల పాదాలకు ఇన్ఫెక్షన్లు చాలా సులభంగా సొకుతాయి.

వానలో తప్పనిసరై బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగులు, రెయిన్‌కోట్లు వేసుకోవడం మంచిది.

*  పొడిగా ఉంటే బట్టలను ధరించాలి.