కిరణ్ కి రాహుల్ పర్సనల్ గా చెప్పిన మేటర్.?

 

అంతా అనుకున్నట్టే కిరణ్ కుమార్ రెడ్డి, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.. దీంతో ఏపీ కాంగ్రెస్ కు కొంత బలం పెరుగుతోంది.. అలానే కార్యకర్తల్లో ఉత్సాహం పెరుగుతోందని కాంగ్రెస్ భావిస్తోంది.. దానికి తగ్గట్టే రాహుల్, కిరణ్ కి కొన్ని సూచనలు చేసినట్టు తెలుస్తోంది.

 

ఇన్నాళ్లు వైఎస్ కుమారుడనే భావనతో జగన్ ని టార్గెట్ చేయలేదు.. కానీ జగన్ మాత్రం మన ప్రత్యర్థి బీజేపీతో పరోక్షంగా చేతులు కలుపుతున్నారు.. కర్ణాటక ఎన్నికల్లో కూడా వైసీపీ నేతలు, బీజేపీకి సహాయం చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి.. అందుకే ఇక నుండి జగన్ ని టార్గెట్ చేయాలని రాహుల్, కిరణ్ కి చెప్పినట్టు తెలుస్తోంది.. అలానే విభజన అనంతరం కాంగ్రెస్ ను వీడి ఇతర పార్టీలలో చేరిన నాయకులను తిరిగి కాంగ్రెస్ లోకి తీసుకొచ్చేలా కృషి చేయాలని చెప్పినట్టు తెలుస్తోంది.. ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్, వైసీపీని బాగానే టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది.. అప్పుడేమో విభజన చేస్తే తెలంగాణలో తెరాస, ఏపీలో వైసీపీ గెలిచి కాంగ్రెస్ కు అండగా ఉంటాయి అని భావిస్తే, రెండు పార్టీలు హ్యాండ్ ఇచ్చాయి.. దీంతో కాంగ్రెస్ తెలంగాణలో తెరాసని టార్గెట్ చేసింది.. ఇప్పుడు ఏపీలో వైసీపీ ని టార్గెట్ చేస్తోంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.