ఏపీ ప్రజలకు మా మద్దతు...

 

ఏపీకి ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చాలని.. టీడీపీ ఎంపీల పోరాటానికి తమ మద్దతు కూడా ఉంటుందని నిన్న సోనియా గాంధీ మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. ఏపీ ప్రజల డిమాండ్లకు తమ పార్టీ మద్దతు తెలుపుతోందని..ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు త్వరలో పూర్తి కావడానికి మద్దతు పలుకుతున్నట్లు చెప్పారు. న్యాయం జరగాలంటే అన్ని పార్టీలు ఏకమై పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. కాగా పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ పై టీడీపీ, వైసీపీ ఎంపీలు ఉభ‌య స‌భ‌ల్లో పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం చేస్తోన్న విష‌యం తెలిసిందే కదా.