రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు.. కాంగ్రెస్ ముక్త్ భారత్ అవుతుంది...


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి త్వరలోనే పార్టీ పగ్గాలు కట్టబెట్టనున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై స్పందించిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాహుల్ పై కామెంట్లు విసిరారు. మీడియా సమావేశంలో పాల్గ్గొన్న ఆయన  మాట్లాడుతూ..  రాహుల్ గాంధీ అధ్యక్షుడవడం తమకే మంచిదన్నారు. కాంగ్రెస్ పార్టీవి వారసత్వ రాజకీయాలని, సోనియా గాంధీ తర్వాత ఆ పార్టీ పగ్గాలు రాహుల్ గాంధీ చేపడతారని, అందులో కొత్తదనం ఏముందని ప్రశ్నించారు. మోడీ చెబుతోన్న కాంగ్రెస్ ముక్త్ భారత్ మరింత త్వరగా సాకారమవుతుందని అన్నారు. మరి యోగి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో చూద్దాం..