మోడీకి తనకి మధ్య ఉన్న తేడా చెప్పిన రాహుల్ గాంధీ..

 

ఈమధ్య కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధానిమోడీపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు కూడా రాహుల్ గాంధీ మోడీ పై విమర్శలు చేసేవాడు... కానీ అప్పుడు తన మాటల్లో అంత పస ఉండేది కాదు... కానీ ఇప్పుడు తన మాటలకు పదునుపెట్టి.. తెగ కౌంటర్లు ఇస్తున్నాడు. దీంతో రాహుల్ కు కాస్త మెచ్యూరిటీ లెవల్స్ పెరిగాయి అని అనుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి మోడీ గురించి మాట్లాడుతూ... కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తనకు ఎంతో గౌరవం ఉందని.. ప్రధాని హోదాలో మోదీ కొన్ని పొరపాట్లు చేసిన మాట వాస్తవమేనని... అంతమాత్రాన, ఆయనను అగౌరవపరచాల్సిన అవసరం లేదని చెప్పారు. గుజరాత్ లోని బనస్కాంతలో జరిగిన బహిరంగసభలో పాల్గొన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ...ప్రధాని మోదీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటే ప్రధానమంత్రికి ఏ మాత్రం గౌరవం ఇవ్వకుండా, అవహేళన చేసేవారని... అయితే, కాంగ్రెస్ కు అలాంటి అలవాటు లేదని అన్నారు. తాము కేవలం ప్రధాని చేస్తున్న పొరపాట్లు, బీజేపీ అనుసరిస్తున్న విధానాలను మాత్రమే ఎత్తి చూపుతున్నామని తెలిపారు. తనకు నలుగురితో కూడిన ట్విట్టర్ టీమ్ ఉందని... తన అభిప్రాయాలను వారితో పంచుకుంటున్నానని.. వారికి సలహాలు, సూచనలు ఇస్తానని... ఆ తర్వాత తన టీమ్ ట్వీట్లు చేస్తుందని చెప్పారు.