లేడిస్ టాయిలెట్ లోకి వెళ్లిన రాహుల్...

 

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటనలో రాహుల్ గాంధీ ఓ పొరపాటు చేసి బుక్కయ్యాడు. గుజరాతీ చదవడం రాక.. అక్కడ లేడిస్ టాయిలెట్ లోకి వెళ్లి నవ్వులపాలయ్యాడు. వివరాల ప్రకారం..గత కొన్ని రోజులుగా గుజరాత్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. యువతతో ముచ్చటించేందుకు 'సంవాద్' పేరిట సదస్సును నిర్వహించిన ఆయన, అక్కడి నుంచి బయటకు వస్తూ లేడీస్ టాయిలెట్ లోకి వెళ్లారు. అక్కడ ఉన్న టాయిలెట్లకు ఎలాంటి ఇండికేషన్లు లేకపోవడం... ఒక పేపర్లో  'మహిళల మరుగుదొడ్డి' అని రాసివుండటంతో... గుజరాతీ చదవడం రాక రాహుల్ లోపలికి వెళ్లారు. ఇంకేముంది ఇది కాస్త అక్కడ ఉన్న కెమెరా కంటికి చిక్కింది. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మొత్తానికి రాహుల్ గాంధీ ఎప్పుడూ ఏదో ఒక రకంగా బుక్కవుతూనే ఉండటం అలవాటే కదా...