మోడీపై నిప్పులు చెరిగిన రాహుల్...

Publish Date:Jan 11, 2017

 

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీపై విమర్సలు చేయడం కొత్తేమి కాదు. నెల రోజులుగా విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్లిన రాహుల్ గాంధీ ఇక్కడకి వచ్చిన వెంటనే యథావిధిగా మోడీపై విమర్సలకు దిగారు. ఈరోజు కాంగ్రెస్ ఆధ్వర్యంలో జన్ వేదన సమ్మేళన్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలోనే 'అచ్చే దిన్' కనిపించిందని.. తమ పార్టీ ప్రజల కోసం ఎన్నో త్యాగాలను చేసిందని తెలిపారు. అధికారం ఉంది కదాని ప్రధాని నరేంద్ర మోదీ, భారత వ్యవస్థనే నాశనం చేశారని.. ప్రజలంతా మోదీని నిలదీయాలని పిలుపునిచ్చారు. ప్రజలను ఇన్ని ఇబ్బందులకు ఎందుకు గురి చేశారని రాహుల్ ప్రధానిని ప్రశ్నించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఇంకా పెద్ద నోట్ల రద్దు గురించి మాట్లాడుతూ..  నోట్లను రద్దు చేయాలన్నది మోదీ వ్యక్తిగత నిర్ణయమేనని, దాని వల్ల వచ్చే కష్టాలను ముందుగా తెలుసుకోకుండా, కనీసం సరిపడినంత నోట్లను సిద్ధం చేసుకోకుండా హడావుడిగా నిర్ణయం ప్రకటించారని ఆరోపించారు. ఆయన నిర్ణయానికి ఆర్బీఐ సైతం వంత పాడటం బావుందని ఎద్దేవ చేశారు.

By
en-us Politics News -