అమిత్ షా పేరు చెప్పగానే తోక ముడిచిన పులివెందుల సెటిల్మెంట్ బ్యాచ్

 

మొన్న ఏప్రిల్ లో ఎపి అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో వైసిపి పై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రధాన ఆరోపణలలో ఒకటి వైసిపి అధికారం లోకి వస్తే సామాన్యులకు భద్రత కరువౌతుందని, అలాగే రౌడీయిజం పెరిగిపోతుందని. తాజాగా విశాఖపట్నంలో పులివెందుల సెటిల్మెంట్ బ్యాచ్ హల్చల్ చేసింది. అత్యంత విలువైన భూ వివాదాలను గుర్తించి సంబంధిత వ్యక్తుల ను బెదిరించి సెటిల్మెంట్ చేసుకోవాలని లేదంటే భూమి కూడా దక్కదని బెదిరిపులకు దిగుతున్నట్లుగా తెలుస్తోంది.

తాజాగా సింబియోసిస్ టెక్నాలజీస్ సీఈవో నరేష్ కుమార్ ఇంటికి ఐదుగురు బ్యాచ్ వెళ్లి 100 కోట్ల విలువ కల ఒక భూ వివాదం సెటిల్ చేసుకోవాలని బెదిరింపులకు దిగినట్లుగా తెలుస్తోంది. తమను తాము సీఎం జగన్ కు అత్యంత సన్నిహితులుగా పేర్కొంటూ వారు ఆ భూమి విషయం సెటిల్ చేసుకోవాలని నరేష్ ను బెదరించగా ఆ భూమి గురించి మాట్లాడవలసిన పని లేదని మీరు సీఎం జగన్ పేరు చెప్పి బెదిరిస్తే తాము కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వద్దకు వెళతామని చెప్పడంతో వెళ్లిపోయారని నరేష్ చెపుతున్నారు. ఈ ముఠా ఇప్పటికే గాజువాకలో మూడు సెటిల్మెంట్లు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ముఠాలో పులివెందులకు చెందిన రిమ్స్ కాంట్రాక్టర్ బాలనారాయణ రెడ్డి, లింగాల రామలింగారెడ్డి, మరొకరు ఎంపిపి, మాజీ సర్పంచ్ ఉన్నట్లు సమాచారం. ఐతే ఇదే విషయమై నరేష్ మాట్లాడుతూ దీనికి సంబంధించి సిసిటివి ఫుటేజ్ ను వైజాగ్ సిపి కి ఈ రోజు అందజేయనున్నట్లు పూర్తి వివరాలు పోలీసులే బయట పెడతారని తెలిపారు.

ఇదే విషయమై బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సీఎం జగన్ ను కలిసి వైజాగ్ లో నెలకొన్న పరిస్థితి గురించి వివరించేందుకు అపాయింట్మెంట్ కోరగా ఇంతవరకు ఇవ్వలేదని తెలుస్తోంది. ఐతే ఈ సంఘటన పై స్పందించిన విష్ణు కుమార్ రాజు పులివెందుల ముఠా మా ప్రభుత్వం మా నాయకుడు అంటూ అరాచకాలు చేస్తున్న మాట వాస్తవమేనని అన్నారు. ఈ వ్యవహారం లో ప్రభుత్వ పెద్దలకు సంబంధం ఉందా లేదా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖలో తాజాగా జరుగుతున్న ఈ భూ దంధాల పై అమిత్ షాకు ఫిర్యాదు చేయనున్నట్లు అయన తెలిపారు. చూద్దాం అవినీతి, దంధాల పై ఉక్కు పాదం అంటున్న సీఎం జగన్ దీని పై ఏ విధంగా స్పందిస్తారో.