పిల్లల కోసం..ట్రింగ్.. ట్రింగ్...

 

 

ఫోన్ మోగిందా.. ఆగండాగండి.. అంత కంగారెందుకు ? ఫోన్ చేసి మాట్లాడడానికి, రిసీవ్ చేసుకోవడానికి కూడా కొన్ని పద్దతున్నాయి. దానినే ఫోన్ ఎటికెట్ అంటారు.


* రిసీవర్ ని పట్టుకునేటపుడు :


మీ బొటనవేలుని రిసీవర్కి ఓ పక్కగా, చూపుడు వేలిని రిసీవర్ పైన, మిగిలిన వేళ్ళని రిసీవర్ కిందుగా ఉంచాలి. ఇలా పట్టుకుంటే అది పడిపోకుండా, జారిపోకుండా ఉంటుంది

* ఫోన్ చేసినపుడు :


హలో అని పలకరించండి.


అప్పుడు సమయాన్ని బట్టి గుడ్ మార్నింగ్ అనో గుడ్ ఈవెనింగ్ అనో విష్ చేయండి.

మీ పేరు చెప్పండి.


మిమ్మల్ని మీరు  తెలియజేయండి.(ఉదా.. నేను రామచంద్రం గారి అమ్మాయినండి)

అవతలి వ్యక్తి ఎవరో తెలుసుకోండి.


మీకు కావాల్సిన వ్యక్తి, లేదా విషయం ఏమిటో చెప్పండి.


మాట్లాడే విషయం పెద్దదైతే మర్చిపోతామనుకుంటే ముందుగా రాసి కనిపించేలా పెట్టుకోండి

* ఫోన్ కాల్ రిసీవ్ చేసుకునేపుడు :

 

రిసీవర్ని చేతిలోకి తీసుకునే ముందు చిన్నగా నవ్వుతూ తీయండి. ఆ నవ్వు మీ  మాటల శైలిని మధురంగా మార్చేస్తుంది.


హలో అనండి సమయానుకూలంగా  విష్ చేయండి.


మీ సంస్థ లేదా ఇంటికి సంబందించిన వివరం తెలియజేయండి.


మీ పేరు హోదా చెప్పండి. నేను మీకేం సహాయం చెయ్యాలి ? అంటూ వినయంగా ప్రశ్నించండి.


కాలర్ చెప్పేది శ్రద్దగా వింటూ అవసరమైనప్పుడు ఊ కొట్టండి.

* గుర్తుంచుకోండి :

ఫోన్ రాగానే తింటూ, తాగుతూ ఉన్నా అలాగే పరిగెట్టి రిసీవ్ చేసుకోవద్దు.


ఏదైనా చదువుతూ, లేదా టివి చూస్తూ ఫోన్ మాట్లాడవద్దు.


ముఖ్యమైన విషయాలు, ఫోన్ నెంబర్లు, చిరునామాలు చెప్పినపుడు కేవలం వినడంతోనే సరిపెట్టుకోకుండా నోట్  చేసుకోండి.


ఏదైనా కారణం చేత కాల్ చేసిన వ్యక్తి కోపంగా వున్నా కూడా నెమ్మదిగా సమాధానం చెప్పండి.


ఫోన్ మీ ఇంట్లో వారికి వచ్చిందని చెప్పడానికి ' మమ్మీ నీకే ఫోన్ ' అని గట్టిగా అరవద్దు. ఒక్క నిముషం లైన్ లో ఉండండి అని అంటూ ఫోన్ ని హోల్డ్ చేసి అప్పుడు ఎవరికైతే ఫోన్ వచ్చిందో వారికి సమాచారం అందించాలి.


ఫోన్ లో  మాట్లాడుతూ మరోపక్క ఇంకేవరితోనైన ముచ్చట్లు పెట్టుకోకూడదు..