జలుబు కోసం కొన్ని చిట్కాలు

* జలుబుతో బాధపడుతుంటే మిరియాలు,బెల్లం, పెరుగు కలుపుకుని సేవించండి. దీంతో ముక్కు దిబ్బడ తగ్గిన జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది.

* ప్రతి రోజు నీటిని బాగా మరగబెట్టి చల్లార్చి తాగితే జలుబు నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.

* పాలలో జాజికాయ, అల్లం, కుంకుమ పువ్వు కలుపుకుని ఉడకబెట్టండి. ఉడకబెట్టిన తర్వాత నీరు సగానికి వస్తే గోరువెచ్చగా ఉన్నప్పుడే సేవించండి. దీంతో జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది.

* ఏడు- ఎనిమిది మిరియాలు నెయ్యిలో వేంచుకున్న వెంటనే సేవించాలి. ఆ తర్వాత గోరు వెచ్చని పాలను సేవించాలి. దీంతో శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి జలుబు తగ్గుముఖం పడుతుంది.

* తమలపాకు రసంలో లవంగాలు, అల్లం రసాన్ని తేనెలో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని సేవించిన వెంటనే జలుబు మటుమాయం.

* అజీర్ణం, గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతుంటే... పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో చిటికెడు జీలకర్ర పొడి, టీ స్పూన్ నిమ్మరసం, టీ స్పూన్ తేనె కలుపు కుని తాగాలి. ఇలా వారం రోజులు చేస్తే పూర్తిగా ఉపశమనం లభిస్తుంది.

* గ్లాసు గోరువెచ్చని నీటిలో టీ స్పూన్ నెయ్యి కలిపి రాత్రి పడుకునే ముందు తీసుకుంటే మలబద్దకం నుండి ఉపశమనం లభిస్తుంది.