రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసిన చంద్రబాబు, కేసీఆర్, జగన్

భారత 14వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు దేశవ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తొలిసారి రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జరుగుతోంది. అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి ఓటును వేయగా, స్పీకర్ కోడెల రెండో ఓటును వేశారు. ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కూడా తన ఎమ్మెల్యేలతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోనూ రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సీఎం కేసీఆర్, స్పీకర్ మధుసూదనాచారి, ప్రతిపక్షనేత జానారెడ్డి తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.