ప్రశాంత్ కిషోర్ ను ప్రశాంతంగా వుండనీయవద్దనే, టీడీపీ డిసైడ్ అయిందా?

 

ప్రశాంత్ కిషోర్… పేరులో ప్రశాంతం వుంది కాని… ఎప్పుడూ ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక పార్టీని ప్రశాంతంగా వుండనీయకుండా చూస్తుంటాడు ఈ మేధావి! మోదీ కోసం దేశం మొత్తం మీద ప్రయోగించిన తన వ్యూహం తరువాతి కాలంలో బీహార్ లో ప్రయోగించాడు. ఆ తరువాత యూపీలో తన బుర్రని ఎక్కుపెట్టి ప్రత్యర్థుల్ని ఢీకొట్టాడు. మోదీ కోసం ప్రశాంత్ కిషోర్ పని చేసినప్పుడు కాంగ్రెస్ కు, దాని మిత్ర పక్షాలకు నిద్ర లేకుండా చేశాడు. తరువాత బీహార్లో బీజేపికి పీడకలగా మారాడు. యూపీలోనూ కమలనాథుల్ని అల్లాడించాలని భావించాడు. కాని, పీకే ఎఫెక్ట్ ఉత్తర్ ప్రదేశ్ కాషాయదళంపై అస్సలు పని చేయలేదు! ఇక ఇప్పుడు ఏపీ మీద కన్నేశాడు ఆధునిక చాణుక్యుడు!

 

నిజంగా ప్రశాంత్ కిషోర్ ఎఫెక్ట్ ఏపీలో ఎంత వరకూ వుంటుంది? ఇప్పుడే చెప్పలేం. కాని, టీడీపీ వారు మాత్రం పెద్ద కర్రతోనే కొట్టాలని భావిస్తున్నట్టుగా వుంది! ఇంతకాలం ప్రశాంత్ కిషోర్ మోదీ కోసం, నితీష్ కోసం, రాహుల్ గాంధీ కోసం … ఎవరి కోసం పని చేసినా… ఆయన మీద ప్రత్యక్ష దాడి జరగలేదు. కాని, ఏపీ టీడీపీ పీకేని ఏకి పారేయాలని డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది! తెర వెనుక వ్యూహాలు రచిస్తాడని పేరున్న ప్రశాంత్ పై టీడీపీ నేత వర్ల రామయ్య విరుచుకుపడ్డారు. ఆయన ఫేక్ ఫేస్బుక్ అకౌంట్ల ద్వారా టీడీపీని అప్రతిష్ఠపాలు చే్స్తున్నారని కంప్లైంట్ చేశారు. పోలీస్ బాస్ తో జగన్ రాజకీయ వ్యూహకర్త మీద కూడా నిఘా పెట్టాలని విన్నపం చేశారు!

 

ప్రశాంత్ కిషోర్ లాంటి పొలిటికల్ ఎనలిస్ట్ మీద టీడీపీ ఎందుకు డైరెక్ట్ గా గురి పెడుతోంది? ఈ విషయం అర్తం కావాలంటే పీకే గ్రౌండ్ లెవల్లో చేస్తున్న హంగామాను అర్థం చేసుకోవాలి! ఆయన జగన్ తరుఫున నియోజక వర్గాల్లో ఎంటరైపోయి ఏకంగా ఎలక్షన్స్ కి సెలక్షన్సే చేసేస్తున్నారు! అంటే, వైసీపీ కీలక నిర్ణయాలు చాలా వాటిల్లో ప్రశాంత్ కిషోర్ మార్కు కనిపిస్తుందన్నమాట ముందు ముందు! ఆయనకు జగన్ అంత ఇంపార్టెన్స్ ఇచ్చేశారు కాబట్టే టీడీపీ వారు కూడా టార్గెట్ చేస్తున్నారు! అదీ కాక తప్పడు ప్రచారంతో సోషల్ మీడియాలో ప్రతాపం చూపటం… ఏ పార్టీ కూడా సహించదు! అందుకే, టీడీపీ వారు ప్రశాంత్ కిషోర్ ను నేరుగానే విమర్శించటం మొదలు పెట్టారు!

 

వచ్చే ఎన్నికల్లో పీకే ఎఫెక్ట్ ఎంత వుంటుందో కాని… ఆయన పేరు మాత్రం బాగానే వార్తల్లో నాన వచ్చు! ఆయన మీద అధికార పక్షం కాన్నన్ ట్రేషన్ చూస్తుంటే అలానే అనిపిస్తోంది!