బీజేపీ అంటే అందుకే ధ్వేషం..!

 

నటుడు ప్రకాశ్ రాజ్ గతకొద్దికాలంగా బీజేపీ నే టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాను ఎందుకు బీజేపీని టార్గెట్ చేశాడో.. అసలు తనకు బీజేపీ అంటే అంత ధ్వేషం ఎందుకో బయటపెట్టారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తాను హిందూ వ్యతిరేకిని కానని... బీజేపీ తీరుతో హిందూయిజం ప్రమాదంలో పడిందన్నారు. అందుకే ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్టు చెప్పారు. ఒక కులం, ఒక మతం మాత్రమే దేశాన్ని ఏలాలనే సిద్ధాంతంతో బీజేపీ పనిచేస్తోందని...తన వెనక ఏ రాజకీయ పార్టీ లేదని, సొంత ఖర్చుతోనే బీజేపీ వ్యతిరేక ప్రచారం చేస్తున్నానని ప్రకాశ్ రాజ్ చెప్పుకొచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తానని, మోదీ నుంచి దేశాన్ని కాపాడేందుకు తనలాంటి చౌకీదార్లు ఎందరెందరో ముందుకు వస్తున్నారని..ప్రజల్లో ఆలోచనా శక్తి పెరిగే కొద్దీ బీజేపీ గ్రాఫ్ పడిపోతోందని...తాను పనిచేసే ప్రతి చోట ప్రజల్లో ఆలోచన రేకెత్తించానని..తాను పనిచేసే ప్రతి చోట ప్రజల్లో ఆలోచన రేకెత్తించానని పేర్కొన్నారు. అందరూ తప్పకుండా ఓటేయాలని కోరానని, అభ్యర్థులు నచ్చకుంటే నోటాకు ఓటేయాలని ప్రచారం చేస్తున్నట్టు తెలిపారు.