దేశంలో పరిస్థితులు చూస్తుంటే భయమేస్తుంది..

 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ప్రధాని దేవేగౌడను కలవడానికి బెంగళూరు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేవేగౌడ, కేసీఆర్ భేటీలో సినీనటుడు ప్రకాశ్‌ రాజ్‌ కూడా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...దేశంలో ఎవరికి మద్దతిస్తే న్యాయం జరుగుతుందో ప్రజలు ఆలోచించాలని.. ఎవరు హామీలు ఇచ్చి మోసం చేశారో ఎవరు న్యాయం చేశారో ప్రజలు తెలుసుకోవాలని, ఏ పార్టీ ద్వారా న్యాయం జరుగుతుందో అర్థం చేసుకోవాలని సూచించారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులు చూసి తాను భయపడుతున్నానని, ఇటువంటి సమయంలో దేశంలో మార్పు కోరుకునే ప్రజలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.