ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా పూనమ్.. ఘానా ప్రెసిడెంట్ కు బహుమతి...


పూనమ్ కౌర్ ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నియామకం పై పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సినీ క్రిటిక్ కత్తి మహేశ్ పవన్ కల్యాణ్ సిఫార్సు చేసి  పూనమ్ కౌర్ ను ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నియమింపజేశాడు అని గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే కదా. ఆ వార్తలు అటూ ఇటూ తిరిగి ఏకంగా ఓ మంత్రిగారే స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాటి చేనేత శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఈ వార్తలపై స్పందించి.. తను చేనేత శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే పూనమ్ కౌర్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమితం కావడం అబద్ధమని.. అసలు ఏపీలో చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఎవరూ లేరని.. తన హయాంలో అలాంటి నియామకం ఏదీ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఇక ఆతరువాత ఆ విషయం గురించి అందరూ మరిచిపోయారు. అయితే ఇప్పుడు ఓ ఆసక్తికరమైన అంశం చోటుచేసుకుంది. అదేంటంటే.. పూనమ్ కౌర్ ఇంకా చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా తన బాధ్యతలు నిర్వర్తించడం. గతంలో మాజీ అమెరికా అధ్యక్షుడు ఒబామా హిందుస్తాన్ టమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ లో పాల్గొనడానికి వచ్చిన ఒబామాను ఆమె కలిసి చీరలను అందించారు. ఇప్పుడు తాజాగా ఘానా ప్రెసిడెంట్ కు ఏపీలో తయారు చేసిన కలంకారి చీరను బహుమతిగా అందించింది. ప్రెసిడెంట్ గారి భార్యకు తన చీరను ఇవ్వాలని కోరింది. ఇంకా ఆశ్యర్యం ఏంటంటే..అదే రోజు ప్రెసిడెంట్ గారి భార్య పుట్టినరోజు కూడా ఉండటంతో... పూనమ్ కౌర్ తన శుభాకాంక్షలు తెలిపింది. మొత్తానికి ఒక పక్క పూనమ్ కౌర్ ను ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నియమించలేదు అని చెబుతున్నా.. తను మాత్రం తన పని చేసుకుంటూపోతుంది.