రాహుల్ గాంధీ మహబూబ్‌నగర్ సభ విశేషాలు

 

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దక్కించుకునే పార్లమెంట్ స్థానాల మీద భారీగా ఆశలు పెట్టుకున్న రాహుల్ గాంధీ మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొని మాట్లాడారు. ఆయన మాటల సారాంశం చూద్దాం.

1- తెలంగాణ అరవై ఏళ్ళ కల ఫలించింది. 2- తెలంగాణ కల నెరవేరడానికి కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన పాత్ర పోషించింది. 3- తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీ తెలంగాణకి అడుగడుగునా అడ్డుపడ్డాయి. 4- తెలంగాణ బిల్లు రూపకల్పనలోగానీ, ఆమోదం పొందడంలోగానీ టీఆర్ఎస్‌కి ఎలాంటి సంబంధం లేదు. 5- తెరాసకి అధికారం ఉంటే చాలు. మరేమీ అక్కర్లేదు. ప్రజల సంక్షేమం అక్కర్లేదు. 6- తెలంగాణ ఇస్తే తెరాసని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని మాట తప్పారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని మరోసారి మాట తప్పాలని అనుకుంటున్నారు. 7- ఎన్నికలలో చేసిన వాగ్దానాలు ఆ తర్వాత తెరాస మరచిపోతుంది. 8- తెలంగాణలోని అన్ని జిల్లాల్లో సమతుల్యమైన అభివృద్ధి చేస్తాం. 9- తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల్లో పదేళ్ళపాటు పన్ను మినహాయింపు ప్రకటిస్తాం. 10- ప్రాణహిత చేవెళ్ళను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తాం. 11- కాంగ్రెస్ దేశం కోసం చాలా చేసింది. ప్రతిపక్షాలు దేశాన్ని పేద, ధనిక భాగాలుగా విడదీస్తున్నాయి. 12- తెలంగాణ పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి. ‘మేడిన్ తెలంగాణ’ వస్తువులు రావాలి. 13- మహిళాబిల్లును ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి.