రాంగ్ రూట్ లో వచ్చిన 'కేకే' కి పోలీసుల 'సెల్యూట్'!

 

రూల్స్ పెట్టింది ప్రజల కోసమే కానీ ప్రజలను పాలించే వారి కోసం కాదని మరోసారి పోలీసులు రుజువు చేశారు. ఓ సామాన్య వ్యక్తి రాంగ్ రూట్లో వాహనాన్ని నడుపుతూ పట్టుబడితే.. ట్రాఫిక్ పోలీసులు మరో ఆలోచన లేకుండా చలానా రాసేస్తారు. కానీ, ఓ రాజకీయ నాయకుడు వస్తే మాత్రం సెల్యూట్ చేశారు.

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు బుధవారంనాడు పార్టీ మీటింగ్ కోసం టీఆర్ఎస్ భవన్ కు రాంగ్ రూట్ లో వచ్చారు. రాంగ్ రూట్లో వచ్చిన వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు ఆపారు. అయితే వాహనం లోపల కేకే ఉండటాన్ని గమనించిన పోలీసులు వెనక్కి తగ్గారు. ఆయనకు సెల్యూట్ చేసి, స్వాగతం పలికారు. ఈ ఘటన కెమెరా కంటికి చిక్కటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.