హ్యాపీ బర్త్‌డే టూ మోడీ

ఇవాళ ప్రధాని నరేంద్రమోడీ పుట్టినరోజు.ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని పుట్టినరోజును పురస్కరించుకుని బీజేపీ దేశవ్యాప్తంగా సేవాదివస్‌ను పాటించనుంది. వైద్యశిబిరాలు, రక్తదానాలు, పరిసరాల పరిశుభ్రత వంటి కార్యక్రమాలు చేపట్టనుంది. తన పుట్టినరోజు సందర్భంగా నిన్న రాత్రే అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని తల్లి ఆశీస్సులు తీసుకున్నారు..అనంతరం సర్దార్ సరోవర్ డ్యాంను జాతికి అంకితం చేయడంతో పాటు అక్కడ జరిగే బహిరంగసభలో ప్రసంగించనున్నారు.