ఇంతకీ మోడీ భారతీయుడేనా? ఆధారాలేమైనా ఉన్నాయా?

సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీ... ఇప్పుడు దేశమంతా వీటి గురించే చర్చ... మొత్తంగా మూడింటి సారాంశం ఒక్కటే... భారతీయ పౌరసత్వం... లేదా మీరు భారతీయులేనా?... జాతీయ జనాభా నమోదు... ఇవే ఇప్పుడు దేశవ్యాప్తంగా వివాదాస్పదమయ్యాయి... మొత్తంగా చూస్తే మీరు భారతీయులేనా? అనే ప్రశ్న కొన్ని వర్గాలను భయపెడుతోంది... అంతేకాదు, మత ప్రాతిపదికన మోడీ ప్రభుత్వం ఇవన్నీ తీసుకొచ్చిందని విపక్షాలు, కొన్ని వర్గాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అండ్ బీజేపీపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి.

మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాలు, బిల్లులతో దేశంలో పలు వర్గాలు భయపడుతున్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే మీరు పాకిస్తాన్ వెళ్లిపోవచ్చు... లేదంటే అమెరికా పోవచ్చన్న కామెంట్స్ ఆయా వర్గాలను ఇబ్బంది పెడుతున్నాయి. మీ భారతీయతను నిరూపించుకోవాలన్న కొందరి వ్యాఖ్యలతో కొన్ని వర్గాలు తీవ్రంగా భయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ వాసి ఒకరు.... ప్రధాని మోడీ భారతీయతనే ప్రశ్నించారు. నరేంద్రమోడీ అసలు భారత పౌరుడేనా? మోడీ భారతయుడేనని నిరూపించుకునేందుకు ఆయన దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటూ ఆర్టీఐ కార్యకర్త జోషి దరఖాస్తు చేశారు. దాంతో, జోషి దరఖాస్తును.... కేంద్ర ప్రజా సమాచార అధికారికి పంపించారు. అయితే, సీఏఏ గురించి కోట్లాది మంది ప్రజలు ఆందోళన చెందుతున్నందుకే, ప్రజాప్రయోజనార్ధం ఈ దరఖాస్తు చేశానని ఆర్టీఐ కార్యకర్త జోషి తెలిపాడు.