మోడీ, షాను టెన్షన్ పెడుతున్న వెంకయ్య.... రబ్బర్ స్టాంప్ అనుకున్నారేమో..

 

కేంద్రం నుండి ఇప్పటివరకూ అందరి సంగతేమో కానీ.. మన రాష్ట్రానికి కాస్తో, కూస్తో సపోర్ట్ గా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క వెంకయ్యనాయుడని చెప్పడంలో ఎలాంటి సందేహం పడాల్సిన అవసరంలేదు. రాష్ట్రానికి కాస్త పెద్ద దిక్కుగా ఉండేవారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ, రాష్ట్రానికి చేతనైంది చేసేవారు వెంకయ్య నాయుడు... మంత్రిగా ఉన్నప్పుడు, తన సొంత శాఖలోనే కాదు, మిగతా శాఖల్లో కూడా రాష్ట్రానికి అధిక కేటాయింపులు వచ్చేలా చూసేవారు. ఆయనను కాస్త మోడీ, అమిత్ షాలు కలిసి ఉపరాష్ట్రపతి పదవి కట్టబెట్టి.. ఏదో పెద్ద పదవి ఇస్తున్నాం అని కలరింగ్ ఇస్తూ.. చాలా సైలెంట్ గా పక్కన పెట్టారు. వెంకయ్యనాయుడిని కావాలనే సైడ్ చేశారని ఆ మధ్య వార్తలు కూడా బాగానే వినిపించాయి.

 

ఇక ఉపరాష్ట్రపతి కదా.. పెద్దగా చేసేది ఏం ఉండదులే అని అనుకున్నారు మోడీ, షా. కానీ వాళ్లకి దిమ్మతిరిగేలా చేశారు వెంకయ్య. ఎదో రబ్బర్ స్టాంప్ లా ఉంటాడులే.. రాజ్యసభని మైంటైన్ చేయటం వరకే ఉంటారు.. అనుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేలు పెట్టరు అనుకున్నారు... కాని ఇప్పుడు అంతా రివర్స్ లో జరుగుతుంది... కొన్నాళ్ళ వరకు సైలెంట్ గా ఉన్న వెంకయ్య, మళ్ళీ పాత ఫార్మ్ లోకి వచ్చారు... టైం దొరికితే రాష్ట్రానికి వచ్చేస్తున్నారు... 15 రోజుల టైం గ్యాప్ లో, ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి, రాష్ట్రంలో మూడు కార్యక్రమాల్లో పాల్గున్నారు...అంతే కాదు, ఉప రాష్ట్రపతి హోదాలో రాష్ట్రానికి సంబంధించిన కీలక పనుల పై రివ్యూ చేస్తున్నారు... కేంద్ర మంత్రుల్ని, సీనియర్ అధికారులని పిలిపించుకుని అన్ని విషయాల పై చర్చించారు... పోలవరం పై సమీక్ష చేశారు... కడప జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన ఉక్కు పరిశ్రమ పై రివ్యూ చేసారు.

 

ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు పరిస్థితి ఒకలా ఉండేది. ఇప్పుడు ఉపరాష్ట్రపతి కావడంతో.. ఎవరైనా ఆయన దగ్గరకు రావాల్సిందే. దీంతో మోడీ, షా ఇద్దరూ... తలలు పట్టుకొని కూర్చున్నారట. అసలు ఏపీ విషయంలో వేలు పెట్టకుండా ఉంటారనే ఆయనికి ఉపరాష్ట్రపతి కట్టబెట్టి సైడ్ చేస్తే.. ఇప్పుడదే కొంపముంచిదేమో అని ఫీలవుతున్నారుట. మొదటి నుండి ఏపీ విషయంలో కాస్త చిన్న చూపు చూనే మోడీ.. నిధులు, ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబును ఇబ్బంది పెడుతుంటే... వెంకయ్య మళ్లీ ఫామ్ లోకి రావడం..ఏపీపై దృష్టి పెట్టడం చూసి.. కక్కలేక మింగలేక అన్నట్టు అన్న సామెత ప్రకారం... ఇద్దరూ బయటకు చెప్పలేక.. లోలోపల దాచుకోలేక.. ఆ బాధను తమలోనే దాచుకుంటున్నారట. మొత్తానికి హనుమంతుడి ముందు కోతి కుప్పి గంతులు వేస్తే ఎంత కామెడీగా ఉంటుందో... అలా రాజకీయాల్లో ఆరి తేరిన వెంకయ్య దగ్గర ఇలాంటి నాటకాలు ఆడితే అలానే ఉంటుంది మరి..