మోడీజీ అప్పుడు ఇంట్లో కూర్చొవచ్చు ఏంచక్కా..


నాలుగేళ్లప్పుడు మోడీకి ఉన్న క్రేజ్ వేరు... నాలుగేళ్ల తరువాత ఇప్పుడు మోడీకి ఉన్నక్రేజ్ వేరు. అప్పట్లో ఎక్కడ చూసిన నమో జపమే కనిపించేది. మోడీ ప్రధానిగా దేశ బాధ్యతలు తీసుకున్నప్పుడు... మోడీ దేశం రూపురేఖలే మార్చేస్తాడు అని ప్రతిఒక్కరిలో ఆశ ఉండేది. కానీ ఎంతటి వారైనా రాజకీయాల విషయానికి వస్తే మాత్రం.. అందరిలో ఒకరిలాగనే అయిపోతారు. ఇందుకు మోడీ కూడా అతీతుడైం కాదని అర్ధమవ్వడానికి నాలుగేళ్లు పట్టింది. అప్పుడు నమో, నమో అని జపం చేసిన వారే ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారయ్యారు. దీనికి ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలే నిదర్సనం. తన సొంత గడ్డ అయిన గుజరాత్ లోనే చచ్చీ చెడీ గెలిచారు. ఇక ఇటీవల రాజస్థాన్లో జరిగిన రెండు ఎంపీ, ఒక అసెంబ్లీ స్థానం ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ విజయం దక్కించుకుంది. దీనికి కారణం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాస్త రాజకీయ అనుభవం ఉన్న ఎవరికైనా ఇట్టే అర్ధమవుతుంది. బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకతే.

 

దానికి తోడు ఇటీవల పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ పై కూడా అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాలకు మాత్రం నిధులు కేటాయించుకున్నారు. దీంతో ఇంకా దేశ‌వ్యాప్తంగా మోడీ ప్ర‌భుత్వం మీద తీవ్ర వ్య‌తిరేక‌త‌ ఏర్పడింది.  చివ‌ర‌కు బీజేపీ పేరు చెపితే జ‌నాలు చీద‌రించుకునే ప‌రిస్థితి వాళ్ల‌కు వాళ్లే క‌ల్పించుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీకి వ‌చ్చే సీట్ల‌పై తాజాగా జ‌రిగిన సర్వేలో వాళ్ల‌కు దిమ్మ‌తిరిగిపోయే ఫ‌లితాలు వ‌చ్చాయట. ప్ర‌స్తుతం బీజేపీకి లోక్‌స‌భ‌లో ఉన్న స‌భ్యుల సంఖ్య 274. సొంతంగా ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాలంటే కావాల్సిన బ‌లం 271. ఇప్పుడు త‌మ‌కు సొంత బ‌లం ఉంద‌న్నది చూసుకునే మోడీ తెగ మిడిసి ప‌డుతున్నాడు.అయితే 2019లో ఎన్నిక‌లు జ‌రిగితే బీజేపీ బ‌లం కేవ‌లం 150 సీట్ల‌కు ప‌డిపోతుంద‌ని స‌ర్వేలు చెపుతున్నాయట. మరి ప్రజలకు కోపం వస్తే ఎలా ఉంటుందో ఇప్పటికే మోడీకి సగం అర్ధమై ఉండొచ్చు. తమ వైఖరి మార్చుకోకుండా.. మాకు బలం ఉంది కదా అని ఇలానే రెచ్చిపోతే...బీజేపీ ఓడి మోడీ ఎంచ‌క్కా ఇంట్లో కూర్చొనే పరిస్థితి వస్తుంది. ఎంత ఎగిరినా కింద పడక మానదు... అలా మోడీ ప్రభుత్వం కూడా అధికార అహంకారంతో ఎగిరితే అంత తొందరగా పడిపోయే కాలం కూడా దగ్గర్లోనే లేకపోలేదు.