వాళ్ల సంగ‌తి అప్పుడు చూసుకుంటా...

 

ప్రధాన మంత్రి మోడీ ఎంపీలకు గట్టి వార్నింగే ఇచ్చారు. మొన్నీమధ్యే ఎంపీలపై పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిషా ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో ఓ బిల్లు పాస్ చేసే సమయంలో పార్టీ ఎంపీలు డుమ్మా కొట్టడంతో.. బిల్లు పాస్ అవ్వడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. దీంతో ఎంపీలపై అమిత్ షా మండిపడ్డారు. ఇక దీనిపై ప్రధాని మోడీ కూడా స్పందించి.. బీజేపీ ఎంపీల‌కు గ‌ట్టి వార్నింగే ఇచ్చారు. బీజేపీ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశంలో మాట్లాడిన మోడీ... వ్యక్తి కంటే పార్టీయే ఉన్న‌త‌మైన‌ద‌ని, ఎంపీలు పార్ల‌మెంట్‌కు రావాల్సిన అవ‌స‌రంపై వాళ్ల‌కు వివ‌రించాల‌ని మోదీ అన్నారు. ఎంపీలు క‌చ్చితంగా హాజ‌ర‌య్యేలా విప్ జారీ చేయాల్సిన అవ‌స‌రం రాకూడ‌ద‌ని ఆయ‌న స్ప‌ష్టంచేశారు. మీరు, నేను అస‌లు ఎవ‌రం? పార్టీయే అంతా. మీరు ఏం కావాలంటే అది చేసుకోండి.. నేను 2019లో చూసుకుంటా అని వార్నింగ్ ఇచ్చారు. ఇప్ప‌టి నుంచి అమిత్‌షా కూడా పార్ల‌మెంట్‌లో ఉంటార‌ని, ఇక వాళ్లంతా క‌చ్చితంగా రావాల్సిందేన‌ని మోదీ స్ప‌ష్టంచేశారు. మరి మోడీ వార్నింగ్ ను ఎంపీలు సీరియస్ గా తీసుకుంటారో..? లేదో..? చూద్దాం...