పీఎం కేర్స్ కు నిధులను ఇచ్చిన టాప్ 10 వీళ్లే....

టాటా సన్స్ అండ్ టాటా ట్రస్ట్... పిఎమ్ సహాయ నిధికి రూ.1500 కోట్లు ను ఇచ్చారు. ఈ నిధిని ప్రోటెక్టివ్ టెస్టింగ్ కిట్స్, రోగుల అవసరాలకు ఉపయోగించనున్నారు.

అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ అండ్ విప్రో ఎంటర్ ప్రైజెస్ రూ.1,125 కోట్లు విరాళంగా ఇచ్చింది. ఈ నిధిని మెడికల్ కిట్స్, సామాజిక అవసరాల కోసం ఉపయోగిస్తారు.

రిలయన్స్ ఫౌండేషన్ రూ.510 కోట్లును విరాళంగా ఇచ్చింది. వీటిని లక్ష ఫేస్ మాస్కులను తయారు చేయటానికి ఉపయోగించనున్నారు.

స్టేట్ ఆయిల్ కంపెనీలు మొత్తంగా రూ.1000 కోట్లు విరాళమిచ్చారు. ఈ నిధుల్లో, వంట గ్యాస్ సరఫరా చేసే ఎవరైనా కోవిడ్‌తో చనిపోతే, వాళ్ల కుటుంబానికి రూ.5లక్షలను ఇవ్వనున్నారు.

పేటిఎం పిఎమ్ సహాయనిధికి రూ.500 కోట్లు విరాళంగా ఇచ్చింది.

ఐటిసి లిమిటెడ్ రూ.150 కోట్లు విరాళంగా ఇచ్చింది.

అదాని ఫౌండేష‌న్ కోవిడ్ 19 సహాయనిదైన పిఎమ్ ఫండ్ కి రూ.100 కోట్లును విరాళంగా ఇచ్చింది.

జఎస్ డబ్ల్యూ గ్రూప్స్ పిఎమ్ సహాయ నిథికి రూ.100 కోట్లు ను విరాళంగా ఇచ్చింది.

వేదాంత్ లిమిటెడ్ పిఎమ్ సహాయ నిధికి రూ.100 కోట్లును విరాళంగా ఇచ్చింది. ఈ నిధులను నిత్యావసర సరుకుల కోసం పనిచేసే రోజువారి కూలీలకు, క్రాంటాక్ట్ ఉద్యోగుల కోసం ఉపయోగిస్తుంది.

బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కూమార్ పిఎమ్ సహాయ నిధికి రూ.25 కోట్లును విరాళంగా ఇచ్చారు.