వైఎస్ఆర్‌సీపీ గుర్తింపును రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్

ఏపీలో అధికార పార్టీ అయిన వైఎస్ఆర్‌సీపీ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బాషా ఈ పిటిషన్ దాఖలు చేశారు. 'యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ'కి బదులుగా వైయస్ఆర్ అనే పేరును వాడుతున్నారంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘానికి కూడా అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్ పేరును ఉపయోగించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వినతి పత్రం అందించారు. 

ఇదిలా ఉంటే, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు కూడా పార్టీ పేరుపై ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మనది 'యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ' అయితే 'వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ' పేరుతో షోకాజ్ నోటీస్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.