ఒక పరాజయం 100 తప్పులు.. టీడీపీకి పెద్ద దెబ్బ వేసిన పెద్ది!

 

టీడీపీ ఘోర పరాజయంలో పెద్ది రామారావు కూడా కీలక పాత్ర పోషించారని చెప్పవచ్చు. నారా లోకేష్ ప్రసంగాలు మెరుగు పరచాలనే ఉద్దేశంతో పెద్ది రామారావును శిక్షకుడిగా ఎంపిక చేసారు. లోకేష్ కి శిక్షణ ఇవ్వడం ఏమో కానీ, ఆయన పార్టీకి పరోక్షంగా శిక్ష విధించారనే అభిప్రాయం వ్యక్తమవవుతోంది.

పెద్ది రామారావు రచయిత. పలు నాటకాలు, సీరియల్స్ రచించారు. మరి ఈయన లోకేష్ దృష్టిలో ఎలా పడ్డారో తెలీదు కానీ.. లోకేష్ ప్రసంగాలు మెరుగుపరిచే బాధ్యత పెద్దికి అప్పగించారు. బహుశా పెద్దికి తెలుగు మీద పట్టు ఉండటం వల్ల ఎంపిక చేశారేమో?. అయితే ఆ ఎంపికే తరువాత వారి కొంపముంచింది. పెద్ది వైసీపీ సానుభూతి పరుడనే ప్రచారం కూడా ఉంది. మరి అలాంటి పెద్దిని లోకేష్ తన దగ్గర ఎలా పెట్టుకున్నారో అర్థంకాని ప్రశ్న.

పెద్ది మూలంగా లోకేష్ ప్రసంగాలలో పెద్దగా మార్పేమీ లేదు. అదే తడబాటు, అదే నవ్వులపాలు. కానీ పెద్ది జీవితం ఈ నాలుగేళ్లలో చాలా మారిపోయిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆయన ఆర్థికంగా చాలా బలపడ్డారట. అంతేకాదు ఈయన పార్టీ డేటాని కూడా లీక్ చేసారని కూడా ఆరోపణలు ఉన్నాయి. అలాగే, ప్రభుత్వం మీద ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందన్న విషయంలో బాబుకి ఈయన తప్పుడు రిపోర్టులు కూడా ఇచ్చారు అంటారు. మొత్తానికి పెద్దిని పక్కన పెట్టుకొని.. బాబు, లోకేష్ లు పార్టీకి పెద్ద నష్టమే చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.