ఈసారి స్క్రిప్ట్ ఎవరు రాసిచ్చారు పవన్

 

ప్రశ్నిస్తానంటూ జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ కి చాలాసార్లు ఎదురైన ప్రశ్న ' స్క్రిప్ట్ ఎవరు రాసిచ్చారు?'  .. పవన్ కొన్ని స్పీచులు వింటుంటే సామాన్యులకి కూడా ఈ ప్రశ్న తలెత్తుతుంది.. రాజకీయ విశ్లేషకులు కూడా పవన్, ఎవరో రాసిచ్చిన దాన్ని చదవకుండా ఆ విషయం మీద అవగాహన పెంచుకొని మాట్లాడితే బాగుంటుందని అంటుంటారు.. తాజాగా పవన్ మాట్లాడిన తీరు చూసి మళ్ళీ అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది.. మన శ్రీకాకుళం వ్యక్తి అడిగితే భూములు ఇవ్వలేదు కానీ 'ఫ్రాంక్లిన్ టెంపుల్ట్రన్ ' అనే వ్యక్తికి లోకేష్ భూములు కట్టబెట్టారని, ఆ భూముల్ని అతను అమ్ముకున్నాడని పవన్ చేసిన ఆరోపణలకి జన సైనికులు సైతం తలలు పట్టుకుంటున్నారు.

నిజానికి 'ఫ్రాంక్లిన్ టెంపుల్ట్రన్' అనేది అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీ.. ఈ కంపెనీని ఏపీ కి తీసుకురావడానికి ఐటీ మినిస్టర్ లోకేష్ చాలా కష్టపడ్డారు.. ఆ కష్టానికి ప్రతిఫలమే ఫ్రాంక్లిన్ టెంపుల్ట్రన్ కంపెనీ వైజాగ్ లో పెట్టడానికి అంగీకరించింది.. దానిలో భాగంగానే ఆ కంపెనీకి ప్రభుత్వం భూములు కేటాయించింది.. ఆ కేటాయింపులో కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి.. కంపెనీ పూర్తిస్థాయిలో ఏర్పడి, ఉద్యోగ హామీలు నెరవేర్చాకే.. ఆ కంపెనీకి భూములు మీద పూర్తిహక్కు వస్తుంది.

పవన్ ఇదంతా తెలుసుకోకుండా ప్రభుత్వం మీద ఏదొక ఆరోపణ చేయాలి అన్నట్టుగా.. కంపెనీ పేరుని వ్యక్తి పేరు అనుకోని ఎవరో రాసిచ్చింది ఇలా గుడ్డిగా చదివి నవ్వులపాలు కాకుండా.. అవగాహన పెంచుకొని మాట్లాడితే మంచిదని రాయకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.