జగన్ పై పవన్ పంచ్ లు... జగన్ ను మోడీ డైరెక్ట్ చేస్తున్నారా..?

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ పై ఓ రేంజ్ లో పంచ్ డైలాగ్స్ విసిరారు. మంగళగిరిలో తన సొంత ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు పవన్. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన్ని పలువురు పలు ప్రశ్నలు అడగగా.. ఆయన వాటికి సమాధానం చెప్పారు. అయితే ఆ సమయంలోనే జనసేన పార్టీ వెనుక కథా, స్క్రీన్ ప్లే మొత్తం చంద్రబాబే ఉన్నారని జగన్ చాలా సందర్భాల్లో అన్నారు.. దానికి మీ సమాధానం ఏంటని సాక్షి  విలేకరి గుచ్చి గుచ్చి అడుగగా... దానికి పవన్ చాలా స్ట్రాంగ్ గా ఆన్సర్ ఇచ్చారు. నా వెనుక చంద్రబాబు ఉంటే.. జగన్ వెనుక నరేంద్ర మోడీ ఉన్నారా.. ఆయనకు మోడీ గారు దర్శకత్వం వహిస్తున్నారా..? జగన్ ను మోడీ నడిపిస్తున్నారా..? అని రివర్స్ కౌంటర్ ఇచ్చారు.. ఇంకా మీరు టీడీపీ తో సంబంధాలు లేవని స్ఫష్టంగా చెప్పడం లేదు కదా.. అని అడుగగా.. నేనెలా ఆలోచిస్తానో బయటకు ఎందుకు చెప్తాను.. వాళ్లు చెబుతున్నారా.. అని అన్నారు. ప్రజా జీవితంలోకి వచ్చిన తరువాత చెప్పాలి అని మళ్లీ అడుగగా... ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు సమయం సందర్భం వచ్చినప్పుడు చెబుతాను కానీ.. నేను ఇలా ఆలోచిస్తున్నానండి.. నా ఉనికి ఇదండీ అని చెప్పాలా.. వాళ్లు చెబుతున్నారా అని గట్టిగానే సమాధానం చెప్పారు. అంతేకాదు  మీరు అర్దం చేసుకోవాల్సి న విషయం ఏంటంటే.. మానాన్నేం సీఎం కాదు... నా దగ్గర దోచుకున్న డబ్బులు లేవు..పార్టీని వెంటనే నడిపించడం అంత తేలిక కాదు.. ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్నాం.. ఒక్కొక్కటి ఏర్పరుచుకుంటున్నాం...అన్ని తట్టుకొని ప్రజల నమ్మకాన్ని సాధించి ముందుకు తీసుకెళ్లడం చాలా కష్టం.. దానికి చాలా సహనం, ఓపిక కావాలి.. నాకు చాలా సహనం, ఓపిక ఉన్నాయి అని ముగించారు. కెలికి మరీ తిట్టించుకోవడం అంటే దీన్నే అంటారు..