అజ్ఞాతవాసి అందుకే ఫట్ అట.. వైసీపీ పైత్యం...

 

సాధారణంగా సినిమా ఫ్లాప్ అయిందంటే దానికి ఎవరిని బాధ్యులు చేస్తారు. సినీ ఇండస్ట్రీ వాళ్లయితే వాళ్లకి సినిమా తీయడం ఎంత కష్టమో తెలుసుకాబట్టి ఎవరి మీద ఆ నెపాన్ని వేయారు. ఇక మిగిలిన వాళ్లు ఎవరికి నచ్చినట్టు వాళ్లు మాట్లాడుకుంటారు. కొంత మంది స్టోరీ బాలేదని.. కొంత మంది డైరెక్షన్ సరిగా లేదని... ఇంకొంత మంది స్ర్కీన్ ప్లే బాలేదని.. ఎవరికి తోచినట్టు వాళ్లు అంటారు. కానీ ఇక్కడ ఓ విచిత్రమైన వార్త ఒకటి తెరపైకి వచ్చింది. ఆ వార్త తెచ్చింది కూడా ఎవరో కాదు.. ఎప్పుడూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించే వైసీపీ బ్యాచ్. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా పోవడానికి కారణం చంద్రబాబు కారణమట. ఇదీ ఇప్పుడు వైసీపీ అందుకున్న పాట.

 

పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. త్రివిక్రమ్, పవన్ కాంబో కాబట్టి పెద్ద ఎత్తున అంచనాలు పెట్టుకున్నారు అందరూ. బ్లాక్ బాస్టర్ హిట్ ఖాయం అని ఫిక్స్ అయ్యారు. కానీ అంచనాలు తలక్రిందులయ్యాయి. అనుకున్నంట టాక్ రాలేదు. ఒకరకంగా చెప్పాలంటే.. ఫ్లాప్ టాక్ కూడా వినిపిస్తోంది. దీంతో.. వైసీపీ కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాలిట ఐరన్ లెగ్ అని కొత్త ప్రచారం మొదలుపెట్టారు. చంద్రబాబుకు సపోర్ట్ చెయ్యడం మొదలు పెట్టాక పవన్ కళ్యాణ్ కు అన్ని ప్లాపులేనట.  “యాధృచ్ఛికమే కావొచ్చు గానీ.. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. జనసేన పార్టీ స్థాపించిన తర్వాత ఈ నాలుగేళ్లలో పవన్‌ కల్యాణ్‌ నటించిన సినిమాలన్నీ ఫ్లాప్‌లే.. గోపాల గోపాల, సర్దార్‌ గబ్బర్‌సింగ్, కాటమరాయుడు సినిమాలు బయ్యర్లను నిలువునా ముంచేశాయి,” అని సాక్షి టీవీకి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉంటే వానలు రావన్న వాదనను తెరపైకి తెచ్చాయి.  ఇప్పుడు ఈ కొత్త వాదనను మొదలుపెట్టాయి. దీంతో జగన్ ఆఖరికి ఇంత దిగజారిపోయాడా అని అనుకుంటున్నారు. జగన్, ఇప్పటికైనే ఇలాంటి పనికిమాలిన వాటి గురించి కాకుండా, కొంచెం ప్రజా సమస్యల పై స్పందిస్తే, ఏమన్నా ఉపయోగం ఉంటుంది... లేకపోతే ఇవాళ నువ్వు ఫ్లాప్ హీరో అంటున్న అతనే, నీ స్థానం లాగేస్తాడు అని కొంతమంది చర్చించుకుంటున్నారు. మరి జగన్ గారు మీరు కూడా ఒకసారి ఆలోచించండి...