పవన్ జాతకంలో అది లేదట..

 

రాజకీయాల్లో జోస్యాలు చెప్పడం కామనే. ఎవరి ఆలోచనా పరిధి మేరకు వాళ్లు కొన్ని అంచనాలు వేస్తూ.. పలానా పార్టీ అధికారంలోకి వస్తుందనో.. లేక పాలానా పార్టీకి ఇన్నీ సీట్లు వస్తాయనే.. ముందుగానే జోస్యం చెబుతుంటారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో కూడా జోస్యం చెప్పారు.. ప్ర‌ముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి తేల్చి. పవన్ నాలుగు రోజుల ఏపీ టూర్ తో ఏపీ రాజకీయాలు కాస్త వేడెక్కాయి అని చెప్పొచ్చు.. పవన్ చేసిన ప్రసంగాలు..ఆయన ప్రతిపక్ష పార్టీలపై వేసిన కౌంటర్లు.. రాష్ట్ర ప్రభుత్వాన్నే కాదు.. కేంద్ర ప్రభుత్వాన్ని సైతం లెక్క చేయకుండా ఆయన కౌంటర్లు విసిరారు. పలు విషయాలపై క్లారిటీ ఇచ్చారు. కొంతమందిగి ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ లు ఇచ్చారు. నాలుగు రోజుల్లో పవన్ పెద్ద హడావుడే చేశాడు. ఇక పవన్ చేసిన ప్రసంగాలకు జనసేన పార్టీ కార్యకర్తలైతే తన నాయకుడు నుండి ఇలాంటి మాటలే వినాలని ఎప్పటినుండో చూస్తున్నామని తెగ ఆనంద పడిపోయారు. ఆ ఆనందంతోనే వచ్చే ఎన్నికలను దృష్టిపెట్టుకోని ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు.

 

దీంతో ఇప్పటివరకూ కేవలం రెండు పార్టీలు మాత్రమే సీఎం కుర్చీ కోసం పోటీ పడ్డాయి. అది అధికార పార్టీ అయిన టీడీపీ, ప్రతిపక్షపార్టీ అయిన వైసీపీ. ఈ రెండు పార్టీలు  వ‌చ్చే సార్వత్రిక ఎన్నిక‌ల్లో సీయం కుర్చీ కోసం నువ్వా-నేనా అన్న‌ట్టు పోటీ ప‌డుతున్నాయి. కాంగ్రెస్ ఉన్నా వేస్ట్ అనుకోండి. ఆ పార్టీ పరిస్థితి గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ టీడీపీ, వైసీపీ పార్టీలతో పాటు.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా నేను కూడా రేసులోకి వ‌స్తున్నట్టు కనిపిస్తోంది.. ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే.

 

అయితే ఇక్కడివరకూ బాగానే ఉన్నా... ఇప్పుడు ఓ వార్త మాత్రం హల్ చల్ చేస్తుంది. అదేంటంటే... జ్యోతిష్యుడు వేణుస్వామి పవన్ గురించి చెప్పిన జోస్యం.. పవన్ కళ్యాణ్‌కు సీయం అయ్యే యోగం ఎట్టి పరిస్థితుల్లో లేదని ఈయన కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశాడు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడో లేదో తెలియదని కానీ… ఆయన జాతకరీత్యా ఆయ‌న ముఖ్య‌మంత్రి అయ్యే ఛాన్స్ లేద‌ని చెప్పారు. ఇంకేముంది ఎప్పటిలాగే పవన్ ప్యాన్స్ వేణుస్వామి పై అటాక్ మొద‌లు పెట్టారు. ఇక దీనిపై స్పందించిన వేణుస్వామి మాత్రం ఎవరి జాతకరీత్యా ఏం జరగాలో అదే జరుగుతుంది… నా పని నేను చేసుకుంటున్నా… మీరు న‌న్ను టార్గెట్ చేసి విమ‌ర్శ‌లు చేస్తే నేను మాత్రం ప‌ట్టించుకోన‌ని వేణుస్వామి అన్నారు. మరి పవన్ విషయంలో వేణుస్వామి చెప్పింది నిజమవుతుందో లేదో దానికి కాలమే సమాధానం చెబుతుంది. కానీ పవన్ నాకు పదవులు అవసరం.. సీఎం కుర్చీ అవసరం లేదు...నేను పదవులు కోసం రాజకీయాల్లోకి రాలేదు.. ప్రజల సేవకోసం వచ్చాను అని చెప్పాడు. అలాంటి పవన్ కు ఈ జ్యోతిష్యాలతో పని ఏముంటుంది.