పవన్ ఉన్న హోటల్ వద్ద ఉద్రిక్తత

సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలోని మూడు జిల్లాల్లో మూడు రోజుల పాటు పర్యటించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. నిన్న కొండగట్టులోని ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన తన యాత్ర ప్రారంభించారు. కార్యకర్తలు, అభిమానులతో సమావేశమైన అనంతరం నిన్న రాత్రి కరీంనగర్‌లోని ఓ హోటల్ బస చేశారు. పవన్ అక్కడున్న విషయం తెలుసుకున్న జనసేన కార్యకర్తలు, అభిమానులు ఈ ఉదయం పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివస్తున్నారు. దీంతో అభిమానులను ఆపడం పోలీసుల తరం కావడం లేదు.. ఒకదశలో తోపులాట చోటు చేసుకుంది. ఈ కారణంగా హోటల్ అద్దాలు ధ్వంసమవ్వగా.. సిబ్బందికి గాయాలయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్ఠితులు చోటు చేసుకున్నాయి. పవన్‌ వ్యక్తిగత భద్రతా సిబ్బంది తక్కువగా ఉండటంతోనే ఈ సమస్య తలెత్తినట్లు సమాచారం.