సినిమాల వల్ల వ్య‌వ‌స్థ‌ మారదు...


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విశాఖపట్నంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే కదా. విశాఖపట్టణంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలుపుతూ ఆయన విశాఖలో పర్యటిస్తున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు వైజాగ్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా పవన్ అక్కడి కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో వారితో పవన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. సినిమాల వల్ల వ్య‌వ‌స్థ‌లో మార్పురాద‌ని.. తాము వ్య‌వ‌స్థ‌లో స‌మూల మార్పులు చేయ‌లేక‌పోవ‌చ్చు కానీ, కొంత‌యినా మార్చుతామ‌ని అన్నారు. తన‌కు రాజకీయాల్లోకి రావాల‌ని ఉంద‌ని 2003లో త‌న‌ అమ్మానాన్న‌ల‌కి చెప్పానని అన్నారు. సినిమా త‌న‌కు అన్నం పెట్టిందని, రాజ‌కీయ వ్యవ‌స్థ బాగుంటే తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చేవాడిని కాద‌ని.. తన‌కు లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి, స‌ర్దార్ ప‌టేల్, నెహ్రూ, అంబేద్క‌ర్  స్ఫూర్తి అని అన్నారు.