పడవ బోల్తా... మోడీ తీవ్ర దిగ్భ్రాంతి..

 

సంక్రాంతి పండుగ రోజు బీహార్ రాజధాని పట్నాలో పడవ బోల్తా పడి విషాదం అలుముకుంది. పాట్నా సమీపంలోని  గంగా నదీ తీరంలో ఓ దీవి వద్ద ఓ పడవలో కొంతమంది బృందం ప్రయాణిస్తూ పతంగులు ఎగురవేస్తున్నారు. ఆ సమయంలో పడవ బోల్తా పడి అందరూ నీట మునిగిపోయారు. ఈ ఘటనలో నిన్న 19 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతిచెందారు. దీంతో మొత్తం మరణించినవారి సంఖ్య 25 మందికి చేరింది.
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

 

మృతుల కుటుంబాలకు ప్రధాని మోడీ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం అందజేశారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా జరిగిన ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు మృతుల కుటుంబాలకు బిహార్‌ ప్రభుత్వం రూ.4లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.