పరకాల ప్రభాకర్‌ రాజీనామా

 

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌ తన పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తుంది.. తనని అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాలు సీఎం చంద్రబాబు మీద విమర్శలు చేయడం, తన మూలంగా బాబుకి చెడ్డ పేరు రావడం ఇష్టం లేక పరకాల రాజీమానా చేసినట్టు తెలిసింది.. ఈరోజు పరకాల తన రాజీమానా లేఖను స్వయంగా చంద్రబాబుకి అందించారట.. లేఖలో తాను రాజీనామా చేయడానికి గల కారణాలను స్పష్టంగా వివరించారు.. 'మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో పోరాడుతున్నారు..  కానీ జగన్ మరియు వైసీపీ నేతలు, నా కుటుంబంలోని వ్యక్తి బీజేపీలో ఉండటాన్ని సాకుగా చూపిస్తూ, లేనిపోనీ ఆరోపణలు చేసి మీ మీద ప్రజలకు అనుమానం కలిగేలా చేయాలని చూస్తున్నారు..

ఒకే కుటుంబలో భిన్న రాజకీయ అభిప్రాయాలు ఉండటం సహజం..అది తెలుసుకోకుండా విపక్షాలు కుటుంబ బంధాలను, రాజకీయ అభిప్రాయాలను ముడిపెడుతూ ఆరోపణలు చేయడం దురదృష్ట కరం. .మీ మీద, ప్రభుత్వం మీద బురద జల్లడానికి, లేనిపోని ఆరోపణలు చెయ్యడానికీ నా పేరూ, నా కుటుంబ సభ్యుల పేర్లూ ఎవ్వరూ వాడుకోకూడదు..అందుకే రాజీనామా చేస్తున్నాను.. గత నాలుగు సంవత్సరాలుగా మన రాష్ట్రానికి సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు కలుగచేసినందుకు ధన్యవాదాలు'.. అని పరకాల తన లేఖలో స్పష్టం చేసినట్టు తెలుస్తుంది.