కుక్కలతో ఎన్నికల ప్రచారం..

అక్కడ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు పోటీ పడి ప్రచారాలు చేస్తున్నారు. ప్రచారం అంటే బహిరంగ సభలు. ఇంటింటి ప్రచారం.  వాహనాలపై ర్యాలీలు, పాదయాత్రలు, ఇవే ఎన్నికల ప్రధాన అస్రాలు. కానీ ఈ ప్రాంతంలో ఒక అభ్యర్థులు క్రేజీగా ప్రచారం చేస్తున్నారు. ఇంతకీ ఆ అభ్యర్థులు ఏం చేశారు. ఎలా ప్రచారం చేశారు అని అనుకుంటున్నారా..? అయితే మరెందుకు ఆలస్యం.. నెక్స్ట్ పేరాకి వెళ్ళండి.  

అసలే కరోనా కాలం.. అందులోనూ పంచాయతీ ఎన్నికలు. ప్రచారానికి వచ్చిన వాళ్ళకి మంచి చెడ్డ చేయడం ఎందుకు అనుకున్నారేమో ఆ అభ్యర్థులు.. కొత్త ప్రచారానికి తెర లేపారు. అది ఇప్పుడు వైరల్ గా మారింది. 

ఓపెన్ చేస్తే.. అక్కడి వీధుల్లో ఊర కుక్కలు ఎక్కువ. అందులోనూ ఖాళీగా ఉన్నాయి. ఆ విషయాన్నీ గమనింకేగిన మనుషులకంటే అదే నిశ్వాసంగా పనిచేస్తాయనుకున్నారేమో.. అందుకే ఆ అభ్యర్థులు వీధి కుక్కలతో ప్రచారం చేస్తున్నారు. భావించారు రాయ్ బరేలీ, బాలియా నియోజకవర్గాల అభ్యర్థులు. 

కట్ చేస్తే.. ఆ అభ్యర్థులు కుక్కల నడుముకి ప్రచార పోస్టర్లు అంటించి. తమకే ఓటు వెయ్యాలని పోస్టర్లపై కోరారు. ఈ ప్రచారంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మీరు మనుషులేనా... మీకు బుద్ధుందా" అని వన్యప్రాణుల ప్రేమికులు ఫైర్ అయ్యారు. విమర్శలు వస్తున్నా... తాము చేసిన పనిని సమర్థించుకుంటున్నారు అభ్యర్థులు. ఏ గోడలపైనో అంటిస్తే... ఎవరూ చూడట్లేదట. అదే కుక్కలపై అంటిస్తే... అందరి దృష్టీ పడుతుందనీ... అలాగైనా తమ పోస్టర్లు చూస్తారని ఇలా చేసినట్లు గొప్పగా చెప్పుకుంటున్నారు.తాము ఏ కుక్కలకూ హాని చెయ్యట్లేదనీ... జస్ట్ పోస్టర్ అంటించి... కుక్కలకు తామే ఆహారం కూడా వేస్తున్నామని చెప్పుకుంటున్నారు. పైగా... ప్రజలు తమ ఐడియాను స్పాగతిస్తున్నారనీ... చెప్పుకుంటున్నారు. 

ఈ విషయం తెలుసుకున్న జంతు హక్కుల పోరాట యోధురాలు రీనా మిశ్రా  కొత్త ప్రచారం పేరు చెప్పి... కుక్కలపై పోస్టర్లు అంటించడమేంటని ఆమె ఫైర్ అయ్యారు. ఎవరైనా సదరు అభ్యర్థి ముఖంపై పోస్టర్ అంటిస్తే... ఆ అభ్యర్థికి ఎలా ఉంటుంది అని ఆమె ప్రశ్నించారు. జంతువుల పై ప్రచారం చేయడంపై ఆ అభ్యర్థుల ఉద్దేశం ఏంటని.. ఆమె ప్రశ్నించారు.  జంతువులకూ కొన్ని రక్షణ చట్టాలు ఉన్నాయన్న ఆమె... వాటికి పోస్టర్లు అంటించడమంటే... హింసించడమే అన్నారు. దీనిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకొని... ఇలాంటి ప్రచారం చేసే అభ్యర్థులను అరెస్టు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఇలా ఈ అంశం వివాదాస్పదంగా మారింది.