పాక్ ప్రధాని కాబోతున్నాడు! మాజీ భార్య మాత్రం ముప్పతిప్పలు పెడుతోంది! 

ఏ దేశంలో అయినా ఎన్నికలు అంటే రాజకీయ పార్టీలు, నేతలు గుర్తుకు వస్తారు. అయితే, నిజంగా రాజకీయాన్ని ప్రభావితం చేసేది పొలిటీషన్స్ అయినా ఎక్కువ చర్చ, రచ్చ జరిగేది మాత్రం సినిమా, క్రికెట్, టీవీ సెలబ్రిటీల గురించే! మన దేశంలో కూడా ఎన్నికలొప్పుడొచ్చినా చూస్తూనే వుంటాం కదా! నలభై ఏళ్ల అనుభవం వున్న రాజకీయ నేతకి దక్కని కవరేజ్ నాలుగు సినిమాలు చేసిన సెలబ్రిటీలకు దక్కేస్తుంది! అంతా గ్లామర్ మహిమ!

 

 

పాకిస్తాన్ లో మరో రెండు రోజుల్లో జాతీయ ఎన్నికలున్నాయి. పాక్ నెక్స్ట్ పీఎం ఎవరో డిసైడ్ అవ్వనుంది. అయితే, ఈసారి పాకిస్తాన్ లో కూడా క్రికెట్ సెలబ్రిటీ హంగామానే నడుస్తోంది. ఒకవైపు మిలటరీ, మరోవైపు ఉగ్రవాదుల అరాచకం మధ్య పాకిస్తాన్ ప్రధాని అంటేనే డమ్మీ అనుకుంటారు ప్రపంచ జనం. అటువంటిది ఈసారి మాజీ క్రికెటర్, వరుస పెళ్లిళ్ల రొమాంటిక్ స్టార్ … ఇమ్రాన్ ఖాన్ పీఎం అయ్యే ఛాన్సెస్ వున్నాయట! చాలా సర్వేలు అదే చెబుతన్నాయి. పాక్ ఆర్మీకి కూడా మనోడే మక్కువగా వున్నాడు. అందుకే, కాస్తో కూస్తో రాజకీయ అనుభవం వున్న నవాజ్ షరీఫ్ ను , అతడి కూతుర్ని లోపలేసి మరీ ఇమ్రాన్ ఖాన్ ను అధికారపు పిచ్ పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది!

 

 

జనంలో క్రేజ్, ఆర్మీతో మంచి సంబంధాలు, అన్నీ బాగానే వున్నా… ప్లేబాయ్ గా పేరుబడ్డ ఇమ్రాన్ ఖాన్ కి అసలు సమస్య మాజీ భార్య రేహమ్ నుంచి వస్తోంది. ఆమెని రెండో భార్యగా నిఖా చేసుకున్న ఈ క్రికెటర్ కమ్ పొలిటీషన్ అలవాటు ప్రకారం వదిలేసి మొన్న ఫిబ్రవరీలో మూడో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు రెండో భార్య రేహమ్ ఆత్మకథ రాస్తున్నా అంటూ … పీఎం పదవిపై పరుగు తీస్తున్న ఇమ్రాన్ ని రన్నవుట్ చేసే పనిలో వుంది! తన పుస్తకంలో రచ్చ రచ్చైపోయే వివరాలు పేర్కొంటోంది. ఇమ్రాన్ ఖాన్ గే అని రేహమ్ చెప్పిందట బుక్కులో. అతడికి ఓ బాలీవుడ్ హీరో సంబంధం వుందని రాసింది ఆత్మకథలో. అంతే కాదు, ఇమ్రాన్ ఖాన్ కు అయిదుగురు అక్రమ సంతానం వున్నారనీ, వాళ్లు రహస్యంగా పెరుగుతున్నారని చెప్పింది. వాళ్లలో కొందరు భారతదేశంలో పెరుగుతున్నారని అనటం కలకలం రేపింది!

 

 

ఎన్నికల ముందు రోజుకో విధంగా ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య డ్యామేజింగ్ చేస్తోంటే కాబోయే పీఎం మాత్రం ఏమీ అనటం లేదు. ఎలక్షన్స్ టైంలో ఏం మాట్లాడితే ఏం జరుగుతుందోనని లోలోన మథనపడుతున్నాడు. అయితే, చిట్ట చివరకు నోరు తెరిచిన ఇమ్రాన్ తన జీవితంలో చేసిన తప్పులన్నిట్లో అతి పెద్ద తప్పు రేహమ్ ఖాన్ ని పెళ్లాడటమేనని అన్నాడు! ఇంతకీ, రేహమ్ చెప్పిన విషయాలన్నీ నిజమా కాదా? ఇమ్రాన్ అయితే వాట్ని ఖండించటం లేదు! అంటే… నిజమనే కదా!

 

 

ఇమ్రాన్ ఖాన్ లాంటి క్యారెక్టర్ పాక్ పీఎం అయితే ఏమవుతుంది? కొత్తగా ఆ దేశానికి జరగాల్సిన నష్టమంటూ ఏం మిగలలేదని కూడా కొందరంటున్నారు. అది పక్కన పెడితే ఇమ్రాన్ పిల్లలు రహస్యంగా మన దేశంలో పెరుగుతున్నారా? వారెవరు? ఇవీ… ఇంట్రస్టింగ్ కొశన్స్. రేపు ఆయన ప్రధాని అయితే… ఏదో ఒక క్షణంలో వారెవరో కూడా బయటకు పొక్కవచ్చు! చూద్దాం! అంతవరకూ మాత్రం పాక్ ఎన్నికల హడావిడిని గమనించటం మంచి ఎంర్టైన్మెంటే! ఎందుకంటే, అక్కడ ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన కొందరు నేతలు… తమ ప్రచార పోస్టర్లపై అమితాబ్, మాధురీ దీక్షిత్ ఫోటోలు ముద్రించి క్యాంపైన్ కొనసాగిస్తున్నారట! పాక్ పై ఇండియా, బాలీవుడ్ల ప్రభావం చాలానే వుందని ఒప్పుకోక తప్పదు!