138 పాక్ సైనికులు మృతి...

 

సరిహద్దు ప్రాంతంల్లో పాక్ తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక పాక్ కాల్పులకు చొరబడటం.. దానికి భారత  సైనికులు ఎదురుకాల్పులు జరపడం గత కొంత కాలంగా ఇదే జరుగుతుంది. అలా గత ఏడాదిలో ఇలాంటి కవ్వింపు చర్యల ఫలితంగా పాక్ 138 సైనికులను పోగొట్టుకుందని జమ్ము, కశ్మీర్ ప్రభుత్వం సహా ఇంటలి జెన్స్ వర్గాలు తెలిపాయి. అంతేకాదు 155 మంది గాయాలపాలయ్యారని తెలిపింది. ఇదే సమయంలో 28 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోగా మరో 70 మందికి గాయాలయ్యాయని తెలిపింది. అయితే ఇలాంటి ఘటనలలో మరణించిన వారు సైనికులు కారని, సాధారణ పౌరులను భారత సైన్యం పొట్టనబెట్టుకుందని ఆరోపించడం పాక్ ప్రభుత్వానికి అలవాటని సైనిక అధికార ప్రతినిధి కల్నల్ అమన్ ఆనంద్ తెలిపారు. ఇటీవల భారత సైన్యానికి చెందిన ఐదుగురు కమాండోలు సరిహద్దు దాటి వెళ్లి ముగ్గురు పాక్ సైనికులను చంపేసిన సంఘటనలోనూ పాక్ ఇదే అబద్ధాన్ని కొనసాగించిందన్నారు.