పాకిస్తాన్‌లో 24 మంది క్రైస్తవులు అదృశ్యం

 

అది పాకిస్తాన్‌ రాజధాని కరాచీ. హై సెక్యూరిటీ ఉండే నగరం. కానీ రాత్రి అయితే చాలు కొంతమంది పోలీసుల వేషంలో బయల్దేరతారు. వాళ్లు ప్రయాణించే వాహనాలకు నేమ్‌ ప్లేట్స్‌ ఉండవు. అలా బయల్దేరిన వాళ్లు క్రైస్తవుల ఇళ్ల ముందు ఆగుతారు. ఇంటరాగేషన్ చేయాలంటూ ఆ ఇంట్లోంచి కొంతమందిని తీసుకువెళ్తారు. అడ్డు వచ్చిన వాళ్లని చితకబాదేస్తారు. ఒకవేళ తలుపులకి తాళాలు వేసుకుంటే, వాటిని బద్దలుకొట్టుకుని మరీ ఇంట్లోకి అడుగుపెడతారు. అలా పోలీసుల’తో కలిసి వెళ్లినవారు ఇంక తిరిగిరారు. ఇలా ఒకటి రెండు కాదు.. గత రెండు నెలల్లో 24 మంది క్రైస్తవులు ఇలా అదృశ్యమైపోయారట. ఇదంతా నిజంగానే ప్రభుత్వం పోలీసుల పనా లేకపోతే ఎవరన్నా తీవ్రవాదుల దుశ్చర్యా అని తలలు పట్టుకుంటున్నారు.