ఆపరేషన్ వశిష్టను నిలిపివేయాలని ఆదేశం.. అయోమయంలో సత్యం బృందం!!

 

ఆపరేషన్ వశిష్టకి మళ్ళీ  ఆటంకాలు ఎదురైయ్యాయి.ఈ సారి ఆటంకం ప్రకృతి వల్ల వచ్చింది కాదు, ప్రభుత్వం వల్ల ఏర్పడింది.తాత్కాలికంగా బోటును వెలికి తీసే పనులు నిలిపి వేయాలని ధర్మాడి సత్యం బృందానికి అధికారుల నుంచి ఆదేశాలందాయి. ఉదయం నదిలోకి వెళ్లి లంగర్ లను వేసి బోటును లాగే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈ ఆదేశాలిచ్చారు దీంతో ధర్మాడి సత్యం బృందం అయోమయంలో పడింది. ఇటు అధికారులు బోట్లు వెలికి తీసేందుకు కాకినాడ నుంచి మరో బృందం తీసుకురానున్నట్లు తెలిపారు. దీంతో కచ్చులూరులో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం కచ్చులూరులో బోటును వెలికి తీసే పనులు పూర్తిగా నిలిచిపోయాయి. మధ్యాహ్నం మూడు గంటలకు కాకినాడ బృందం కచ్చులూరుకు చేరుకుంటుందని సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

రెండు రోజులుగా కచ్చులూరులో బోటును వెలికి తీసే పనిలో నిమగ్నమైంది ధర్మాడి సత్యం బృందం. బోటుకు లంగరు వేసి బయటకు లాగి కొట్టింది గోదావరి ఒడ్డు నుంచి రెండు వందల మీటర్ల దూరంలో నూట ఇరవై అడుగుల లోతులో బోటు ఉన్నట్లు గుర్తించింది ధర్మాడి సత్యం బృందం. సత్యం బృందంలో దాదాపు ఇరవై ఐదు మంది అనుభవజ్ఞులతోనూ, మరికొంతమంది మత్స్యకారులున్నారు పూర్తి సాంప్రదాయ పధ్ధతిలోనే బోటును వెలికితీయాలని భావించింది ధర్మాడి సత్యం బృందం. కానీ తాజాగా అధికారుల ఆదేశాలతో బోటు వెలికితీత పనులు పూర్తిగా నిలిచిపోయాయి .ఇంతకీ అధికారులూ ఆపరేషన్ వశిష్టను ఎందుకు నిలిపివేశారు, అధికారు లు వచ్చే వరకు పనులు ఎందుకు నిలిపివేయమన్నారు అనేది చర్చనీయాంశంగా మారింది.ఖచ్చితంగా ఈ రోజును బయటకు తీసే పట్టుదలతో ఉన్న సత్యం బృందానికి పది పదిహేను పది గంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో అధికారులకు ఆ ఒక మెసేజ్ ఐతే వచ్చింది. కాకినాడ పోర్టు నుంచి నిపుణుల వస్తున్నారు వారు వచ్చే వరకు కూడా ఎక్కడ పనులు అక్కడే ఆపి ఉంచాలని చెప్పి చెప్పడం తొట్టి వీరందరూ కూడా ఈ పనులు నిలిపివేశారు.

మూడు గంటల వరకు కూడా వారు రాకపోవడంతో పనులు మళ్లీ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి అని ఆలోచనలో పడ్డారు బృందం సిబ్బంది. మూడు గంటల తరువాత అంటే దాదాపు గంటా రెండు గంటలకు మించి అంటే ఐదు గంటల తరవాత ఇక్కడ  లైటింగ్ సహకరించదని మళ్లీ ఆపరేషన్ మొత్తం పూర్తిగా నిలిపి వేసి దేవీ పట్నానికి వెళ్లి పోయేటువంటి పరిస్తితి ఉంటుంది బృందం వెల్లడిస్తోంది. ఇలాంటి సందర్భంలో పూర్తిగా కూడా ఈ రోజు పనులన్నీ కూడా ఆగిపోవటంతో రాయల్ వశిష్ట  బోటు వెలికి తీసే కార్యక్రమం ఆగిపోవచ్చని వెల్లడిస్తున్నారు సత్యం బృందం. కాకినాడ పోర్టు నుంచి ఎందుకు నిపుణులును ఇప్పుడు రమ్మంటున్నారో వారు వచ్చే వరకు ఎందుకు పనులను నిలిపివేయ్యాలంటున్నారు అనేది ప్రశ్నార్ధకరంగా మారింది.ఎంత త్వరగా బోటును బయటకు తిసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్న సత్యం బృందానికి ప్రభుత్వం ఎందుకు ఆటంకాలు తలపెడుతోందో తెలాల్సి ఉంది. ప్రభుత్వం వైఖరికి తీవ్రంగా మండి పడుతున్నారు బాధిత కుటుంబాలు.అసలు బోటు బయటకు వస్తుందా లేదా అన్నది ప్రశ్నార్ధకంగా మిగలనుంది.