మోడీకి దెబ్బ మీద దెబ్బ

ప్రస్తుతం పరిస్థితులన్నీ బీజేపీ మీద బాగా పగపట్టేసినట్టు ఉన్నాయి.. మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా దూరమవుతూ బీజేపీకి దెబ్బ మీద దెబ్బ పడుతుంది.. ఇప్పుడు మరో మిత్రపక్షం బీజేపీ గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.. అదే బీహార్ లోని జేడీయూ పార్టీ.. గత ఏడాది ఆర్జేడీతో తెగదెంపులు చేసుకుని బీజేపీతో కలిసిన నితీష్ కుమార్ జేడీయూ తిరిగి లాలూ పార్టీతో చేతులు కలపాలని చూస్తుందట.. నితీష్ కుమార్, బీజేపీతో ఇమడలేకపోతున్నారని తెలుస్తుంది.. మరోవైపు బీజేపీ మీద వ్యతిరేక పవనాలు కూడా వీస్తున్నాయి.. బీజేపీతో కలిసుంటే వచ్చే ఎన్నికల ఫలితాల మీద ప్రభావం పడుతుంది.. అందుకే నితీష్ కుమార్ బీజేపీ తో తెగదెంపులు చేసుకునే ఆలోచనలో ఉన్నారట.. ఇప్పటికే నితీష్ సన్నిహితులు ఆర్జేడీ మరియు కాంగ్రెస్ నేతలతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది.

అయితే ఆర్జేడీ, నితీష్ తో దోస్తీ అంటే కాస్త ఆలోచిస్తుందట.. నితీష్ ని నమ్మలేం అనుకుంటున్నారట.. అదీకాక లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం మీద సిబిఐని ఉసిగొల్పారు.. అలాంటి వారితో దోస్తీ వద్దని ఆర్జేడీ నేతలు భావిస్తున్నారట.. ఇక కాంగ్రెస్ పరిస్థితి వేరేలా ఉంది.. బీజేపీని గద్దె దించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్, ఏ పార్టీతో అయినా దోస్తీకి సిద్దమే.. కానీ లాలూ ఆర్జెడీకి ఇష్టం లేకుండా జేడీయూతో దోస్తీ చేసే సాహసం చేయదు.. ఇదే విషయం కాంగ్రెస్ నేతలు, జేడీయూ నేతలకు చెప్పినట్టు తెలుస్తుంది.. మీతో దోస్తీకి ఆర్జేడీ ఓకే అంటే మాకు ఓకే అన్నారట.. మరి నితీష్ తనమీద ఆర్జేడీ నేతలకు ఉన్న ఆగ్రహాన్ని తగ్గించి మళ్ళీ ఆర్జేడీతో చేతులు కలుపుతారా? చూద్దాం ఇదే జరిగితే బీజేపీకి మరో దెబ్బ తగిలినట్టే.