అప్పుడు భార్య శవంతో.. ఇప్పుడు ఇలా...

 

ఓ వ్యక్తి తన భార్య శవాన్ని భుజాన మోసుకొని దాదాపు 10 కిలోమీటర్లు నడిచి వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే కదా. కనీసం మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్ సేవలు కూడా అందించకపోవడంతో శవాన్ని భుజానే వేసుకొని తన ఊరికి బయలుదేరాడు దనా మాఝీ. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. ఇక ఇది కాస్త పెద్ద న్యూస్ గా వైరల్ అయింది. ఈ ఘటన జరిగి ఇప్పటికీ ఏడాది గడుస్తుంది. అయితే ఇప్పుడు అదే దనా మాఝీ ఎలా ఉన్నాడో తెలుసా. అప్పట్లో దారిద్ర్యంలో కొట్టుమిట్టాడిన దనా మాఝీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రధాన మంత్రి గ్రామీణ్‌ ఆవాస్‌ యోజన కింద ఓ ఇంటిని కట్టేసుకున్నాడు. పలువురు దాతలు అందించిన సహకారంతో ఇప్పుడు అతని ఆర్థిక స్థితి బాగానే ఉంది. అందులో బహ్రైన్‌​ ప్రధాని ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీపా అందించిన 9 లక్షల సాయం కూడా ఉన్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు కనీసం బ్యాంక్‌ అకౌంట్‌ కూడా లేని అతను ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌తో అకౌంట్‌ ఓపెన్‌ చేశాడు. భువనేశ్వర్‌లో అతని ముగ్గురి కూతుళ్లకు ప్రభుత్వమే ఉచిత విద్యను అందిస్తోంది. 16 నెలల తర్వాత తన భార్య శవంతో నడిచిన అదే రోడ్డుపై 65 వేలు పెట్టి బైక్‌ను కొని నడిపి మరోసారి ధనా మాఝీ వార్తల్లోకెక్కాడు.